నేను మార్లిన్ మన్రో.. మైకేల్ జాక్సన్ ఆత్మను పెళ్లాడా..!

By telugu teamFirst Published Aug 20, 2021, 3:35 PM IST
Highlights

అమెరికాకు చెందిన కాథ్లిన్ రాబర్ట్స్ తాను డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ ఆత్మను మనువాడినట్టు వెల్లడించారు. అంతేకాదు, తాను మార్లిన్ మన్రో పునర్జన్మనని వివరించారు. తాను స్నానమాడి బయటికి వస్తుండగా మైఖేల్ తనకు ప్రపోజ్ చేశాడని, ఈ కార్యక్రమాన్ని మార్టిన్  లూథర్ కింగ్ జూనియర్ ఏర్పాటు చేశాడని విస్తూపోయే అంశాలు చెప్పుకొచ్చారు. తాను మైఖేల్ భార్యభర్తల్లా మెలుగుతామని, కానీ, లైంగికంగా కలవలేదని వివరించారు.

వాషింగ్టన్: కోరికలు తీరకుండా మరణించిన వారు ఆత్మలుగా మిగులుతారని చాలా సినిమాల్లో చూశాం. నిరంతరం తీరని గాఢమైన కోరికలు, లక్ష్యాలతో బతికే వారికి ఒక్కోసారి మతిభ్రమిస్తుందనీ విన్నాం. ఇవన్నీ సైకలాజికల్ ఇష్యూస్ అని కొట్టిపడేసే నిపుణుల వివరణలూ చదివాం. కానీ, అవి నిజమా, అబద్ధమా అనే నిర్ధారణపై చర్చ ఎడతెగనిదిగా సాగుతుంది. ఇదే చర్చను మరోసారి లేవనెత్తింది అమెరికాకు చెందిన కాథ్లీన్ రాబర్ట్స్. గత జన్మలో తానే మార్లిన్ మన్రో అని, ఈ జన్మలో రాబర్ట్స్‌గా పునర్జన్మించారని వెల్లడించారు. అంతేకాదు, విశ్వ విఖ్యాత డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ ఆత్మను మనువాడినట్టూ ప్రకటించి అందరినీ అవాక్కు చేశారు.

మైఖేల్ జాక్సన్ తనను పింక్ ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో ప్రపోజ్ చేశాడని రాబర్ట్స్ ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు. తాను స్నానం చేసి బయటకు వస్తున్నప్పుడు ఇలా ప్రతిపాదించాడని ఆమె వివరించారు. అంతేకాదు, ఈ కార్యక్రమాన్ని దివంగత హక్కుల యోధుడు మార్టిన్ లూథర్ కింగ్ (జూనియర్) ఏర్పాటు చేశాడని సెలవిచ్చారు.

మైఖేలో టీవీ షోల్లో సిగ్గుపడుతూ కనిపిస్తాడని, కానీ, తనతో అలా ఎప్పుడూ వ్యవహరించలేదని కాథ్లిన్ రాబర్ట్స్ అన్నారు. ఆయన అనుక్షణం తనతో ఉంటాడని, కానీ, ఎప్పుడూ సిగ్గుపడుతున్నట్టు అనిపించలేదని వివరించారు. తనతో అన్ని విషయాలు పంచుకుంటాడని, తప్పు చేస్తే హెచ్చరిస్తాడనీ అన్నారు. మైఖేల్ తనతో చాలా చనువుగా మెదులుతుంటాడని తెలిపారు. రెస్ట్ రూమ్‌లోకీ ఆయన వచ్చేస్తాడని చెప్పారు. ఈ ప్రత్యేకమైన అనుబంధాన్ని ‘టాయిలెటరీస్’ పేర్కొంటాడని వివరించారు. 

తాము వైవాహిక బంధంలో ఉన్నప్పటికీ లైంగికంగా ఏకమవ్వలేదని చెప్పారు. అందుకు మైఖేల్ ఒప్పుకోడని చెప్పుకొచ్చారు. తాను ఒకసారి కిస్ చేయడానికి ప్రయత్నిస్తే సీరియస్ అవుతాడని అన్నారు. సాలెపురుగు, లేదా శవంలా మారి బెదిరిస్తాడని చెప్పారు. అయితే, ఆయన తన దేహాన్ని ఆయనకు ఇష్టవచ్చినట్టుగా వాడుకుంటాడని వివరించారు. వంటలు చేయడం ఆయనకు చాలా ఇష్టమని అన్నారు.

మైఖేల్ జాక్సన్ తననే భార్యగా ఎంచుకోవడానికి కొన్ని కారణాలున్నాయని కాథ్లిన్ రాబర్ట్స్ అన్నారు. తాను మార్లిన్ మన్రోగా కనిపిస్తారని, బహుశా అందుకే ఆయన తనను ఆయన సహచరిగా ఎన్నుకొని ఉంటాడని వివరించారు. తామిద్దరమూ కష్టనష్టాలను అనుభవించామని చెప్పారు.

click me!