ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చాడు. ట్విట్టర్ వేదికగా డబ్ల్యు హెచ్ ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ కు మూడు పేజీల లేఖను రాశాడు. ఈ లేఖ ప్రతిని ఆయన ట్విట్టర్ లో షేర్ చేశాడు.
వాషింగ్టన్: ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చాడు. ట్విట్టర్ వేదికగా డబ్ల్యు హెచ్ ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ కు మూడు పేజీల లేఖను రాశాడు. ఈ లేఖ ప్రతిని ఆయన ట్విట్టర్ లో షేర్ చేశాడు.
కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను అలర్ట్ చేయలేదని అమెరికా ఆరోపిస్తోంది.ఈ విషయమై నెల రోజుల లోపుగా నివేదిక ఇవ్వాలని కోరారు. అంతేకాదు నెల రోజుల్లో నివేదిక ఇవ్వకపోతే డబ్ల్యు హెచ్ ఓ కు పూర్తిగా నిధులను నిలిపివేస్తామని హెచ్చరించారు. సోమవారం నాడు ట్రంప్ ఈ లేఖను రాశాడు.
undefined
చైనాకు అనుకూలంగా డబ్ల్యు హెచ్ ఓ వ్యవహరించిందని ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అలర్ట్ చేయడంలో డబ్ల్యు హెచ్ ఓ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా విషయమై చైనా ఇచ్చిన సమాచారానికి క్షేత్రస్థాయిలో ఉన్న సమాచారానికి మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికి కూడ డబ్ల్యు హెచ్ ఓ పట్టించుకోలేదని ట్రంప్ ఆరోపణలు గుప్పించారు.
గత ఏడాది డిసెంబర్ 30న వుహన్ లో పరిస్థితి దారుణంగా ఉందని తైవాన్ చేసిన ఆరోపణలను ట్రంప్ ఈ లేఖలో ప్రస్తావించారు. చైనాలోకి అంతర్జాతీయ వైద్య నిపుణుల్ని అనుమతించేలా చైనా ప్రభుత్వాన్ని ఒప్పించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఫల్యం చెందిందన్నారు.
also read:ప్రతిరోజూ నేను హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్ వేసుకొంటున్నా: ట్రంప్
మరో వైపు డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ జనరలల్ టెడ్రోస్ అథనామ్ చైనాకు అంటకాగుతున్నారని ఈ లేఖలో ట్రంప్ ఆరోపించారు. ఈ కారణంగానే ప్రపంచం మొత్తం ఈ రకమైన పరిస్థితి నెలకొందన్నారు. అంతేకాదు అవసరమైతే డబ్ల్యుహెచ్ఓ నుండి అమెరికా వైదొలిగేందుకు కూడ వెనుకాడబోదని కూడ ట్రంప్ ఆ లేఖలో హెచ్చరించారు.