Facebook Down : గంటల వ్యవధిలో 7 బిలియన్ డాలర్లు హాంఫట్.. 3 నుంచి 5వ స్థానానికి పడిపోయిన జుకర్బర్గ్...

By AN TeluguFirst Published Oct 5, 2021, 2:29 PM IST
Highlights

ఫేస్ బుక్ లో సమస్యలు తలెత్తాయన్న వార్తలు బయటికు తెలియగానే సంస్థ షేర్లు 5 శాతం మేర పడిపోయాయి. దీంతో గతనెల మధ్య నుంచి ఇప్పటివరకు కంపెనీ షేర్ల విలువలో 15 శాతం తగ్గుదల నమోదయ్యంది. అలాగే నిన్న అనేక కంపెనీలు ఫేస్ బుక్ నుంచి తమ ప్రకటనలను తొలగించాయి. ఈ నేపథ్యంలో జుకర్ బర్గ్ సంపద తగ్గిపోయింది. 

సోమవారం సామాజిక మాధ్యమాలు ఫేస్ బుక్ (Facebook), వాట్సప్(WhatsApp), ఇన్ స్టాగ్రామ్ (Instagram down) స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ (Mark Zuckerberg)సంపద కొన్ని గంటల వ్యవధిలోనే 7 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.52వేల కోట్లు) (USD 7 billion)తరిగిపోయింది. దీంతో ఆయన బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ జాబితాలో మూడు నుంచి ఐదో స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం ఆయన సంపద 122 బిటియన్ డాలర్లుగా ఉంది. 

ఫేస్ బుక్ లో సమస్యలు తలెత్తాయన్న వార్తలు బయటికు తెలియగానే సంస్థ షేర్లు 5 శాతం మేర పడిపోయాయి. దీంతో గతనెల మధ్య నుంచి ఇప్పటివరకు కంపెనీ షేర్ల విలువలో 15 శాతం తగ్గుదల నమోదయ్యంది. అలాగే నిన్న అనేక కంపెనీలు ఫేస్ బుక్ నుంచి తమ ప్రకటనలను తొలగించాయి. ఈ నేపథ్యంలో జుకర్ బర్గ్ సంపద తగ్గిపోయింది. 

ఈ సామాజిక మాధ్యమాలు సోమవారం రాత్రి 9 గంటల నుంచి స్తంభించిపోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సాంకేతిక సాధనాలపై ఆధారపడిన కొన్ని కోట్ల మంది ఎందుకిలా జరిగిందో అర్థం కాక.. గంటల తరబడి నానా హైరానా పడ్డారు. 

కొందరు ప్రత్యామ్నాయ సామాజిక మాధ్యమాల వైపు దృష్టి సారించారు. దీంతో వాటికి ఒక్కసారిగా తాకిడి పెరిగింది. ఈ హఠాత్ పరిణామంపై ఫేస్ బుక్ వివరణ ఇచ్చింది. సాంకేతిక కారణాలతో సేవలు నిలిచిపోయాయని, పునరుద్ధరణ చర్యలు చేపట్టామని ప్రకటించింది. అంతరాయంపై జుకర్ బర్గ్ స్వయంగా క్షమాపణలు చెప్పారు. 

కాగా, ఈ రోజు అంతరాయం కలిగించినందుకు క్షమించండి. మీ ఆప్తులతో సన్నిహితంగా ఉండటానికి మీరు మా సేవలపై ఎంతగా ఆధారపడతారో నాకు తెలుసు" అని జుకర్‌బర్గ్ చెప్పుకొచ్చారు.

సేవలు పునరుద్ధరించబడిన తరువాత మంగళవారం ఉదయం ట్విట్టర్‌లో, వాట్సాప్ ఇలా పోస్ట్ చేసింది : "ఈ రోజు వాట్సాప్‌ను ఉపయోగించలేకపోయిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నాం. మేం నెమ్మదిగా, జాగ్రత్తగా వాట్సాప్‌ను మళ్లీ పని చేయించడం ప్రారంభించాము. మీ సహనానికి ధన్యవాదాలు. మీతో పంచుకునే మరింత సమాచారం ఉన్నప్పుడు మేము మీకు అప్ డేట్ చేస్తాం’ అని చెప్పుకొచ్చింది.

‘అంతరాయానికి చింతిస్తున్నాం’.. వినియోగదారులకు క్షమాపణలు చెప్పిన మాక్స్ జుకర్ బర్గ్

ఫేస్‌బుక్ కార్పొరేట్ అంబ్రెల్లా కింద ఉన్న ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఇతర సర్వీసులు ఇప్పుడు సాధారణంగా నడుస్తున్నాయని,  11:30 EST తర్వాత మొదటిసారి పూర్తిగా యాక్సెస్ చేయబడుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. 

ఇంటర్నెట్‌లో అంతరాయాల నివేదికలను పర్యవేక్షించే సైట్, డౌన్‌డెటెక్టర్ చెబుతున్న దానిప్రకారం ఫేస్‌బుక్ సేవలకు ఈ స్థాయిలో అంతరాయం కలగడం ఇదే మొదటి సారి అని చెబుతున్నారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా 10.6 మిలియన్ల ప్రాబ్లం రిపోర్టులు వచ్చాయని తెలిపారు. 

click me!