తాలిబన్లు ఉగ్రవాదులే.. నిషేధం విధించిన ఫేస్ బుక్..అదే బాటలో ట్విటర్..

By AN TeluguFirst Published Aug 17, 2021, 11:15 AM IST
Highlights

అఫ్గాన్ లో పరిస్థితిని ఫేస్ బుక్ నిశితంగా గమనిస్తోందని ఆ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. నిషేధిత సంస్థలకు సంబంధించిన ఏదైనా వాట్సాప్ ఖాతాపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరో సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ ను తాలిబన్లు యథేచ్ఛగా వాడుతున్నారు. ఇటీవల ఆఫ్గాన్ ను స్వాధీనం చేసుకున్న విషయాన్ని తాలిబన్ ప్రతినిధి ట్విటర్ వేదికగానే ప్రకటించారు.

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తాలిబన్లను ఉగ్రవాదులుగా పేర్కొంది. వారికి సంబంధించిన కంటెంట్ను తమ సంస్థల వేదికలపై నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. కానీ, తాలిబన్లు ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్టెడ్ మెసేజ్లను పంపే వాట్సాప్ ను నిరంతరాయంగా వాడుతున్నారు. కంపెనీ నిషేధం విధించినా వారిని అడ్డుకోలేక పోవడం గమనార్హం.

ఫేస్బుక్ ప్రతినిధి మాట్లాడుతూ అఫ్గాన్ లో పరిస్థితిని సంస్థ తమ సంస్థ నిశితంగా గమనిస్తోందని పేర్కొన్నారు. నిషేధిత సంస్థలకు సంబంధించిన ఏదైనా వాట్సాప్ ఖాతాపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరో సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ ను తాలిబన్లు యథేచ్ఛగా వాడుతున్నారు. ఇటీవల ఆఫ్గాన్ ను స్వాధీనం చేసుకున్న విషయాన్ని తాలిబన్ ప్రతినిధి ట్విటర్ వేదికగానే ప్రకటించారు.

దీనిపై ఓ ఆంగ్ల వార్తా సంస్థ ప్రశ్నించగా.. తాము హింసను ప్రోత్సహించే సంస్థలను, విద్వేషాన్ని రెచ్చగొట్టే సంస్థలను ట్విటర్ వినియోగించనీయమని పేర్కొంది.  వీటిని ఏ విధంగా గుర్తిస్తారో మాత్రం వెల్లడించలేదు.  తాలిబన్లు అధికారంలోకి వచ్చాక పౌరహక్కుల హరించడం, మహిళలను అణచివేయడం వంటివి చేస్తారని భయపడుతున్నారు. మరోపక్క తాలిబన్ ప్రతినిధులు మాత్రం తాము శాంతియుతమైన అంతర్జాతీయ సంబంధాలను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. 

ఆఫ్ఘన్‌ నుండి బలగాల ఉపసంహరణ సరైందే: బైడెన్

కాగా, ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు మళ్లీ ఆక్రమించుకోవడాన్ని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శుభపరిణామంగా అభివర్ణించారు. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ బానిస సంకెళ్లను తెంచారని ప్రశంసలు కురిపించారు. విద్యా బోధన ఆంగ్ల మాధ్యమంలో చేపట్టడాన్ని ఆయన వ్యతిరేకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సొంత సంస్కృతిని వదిలి ఇతరుల సంస్కృతిని ఆచరిస్తే మానసికంగా మనం దానికి విధేయులగా మారిపోతాం. అది వాస్తవమైన బానిసత్వం కంటే హీనమైందని మనందరం గుర్తుపెట్టుకోవాలి. సాంస్కృతిక బానిసత్వం సంకెళ్లను తెంచేయడం చాలా కష్టం. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పటి వరకు ఇదే జరిగింది. తాలిబన్లు ఇప్పుడు ఆ సంకెళ్లను తెంచేశారు’ అని కితాబిచ్చారు.

పాకిస్తాన్‌కు చేదోడు వాదోడుగా ఉంటున్న డ్రాగన్ కంట్రీ కూడా తాలిబన్లతో దోస్తీ చేయడానికి పాజిటివ్‌గా రెస్పాండ్ అయింది. తాలిబన్లతో స్నేహాన్ని మరింత పెంచుకోవడానికి సంసిద్ధంగా చైనా వెల్లడించింది. రష్యా రాయబారి మంగళవారం తాలిబన్లతో భేటీ కానున్నారు. రష్యా విదేశాంగ మంత్రి జమీర్ కాబులోవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో రష్యా దౌత్య వ్యవహరాల రక్షణ ప్రధాన అజెండాగా ఈ సమావేశం సాగుతుందని వివరించారు.

బుల్లెట్లు, బాంబులతో అతలాకుతలమైన ఆఫ్ఘనిస్తాన్‌లో పదిరోజుల్లోనే పరిస్థితులు శరవేగంగా మారిపోయాయి. తాలిబన్లు వేగంగా కాందహార్‌ను స్వాధీన పరుచుకోవడం కాబూల్‌ను వశపరుచుకుని అధికారాన్ని తమచేతుల్లోకి తీసుకోవడం రోజుల వ్యవధిలోనే ముగించింది. 20 ఏళ్ల పోరాటంలో తాలిబన్లే గెలిచారని దేశం వదిలిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అన్నారు.
 

click me!