అమెరికా మాజీ డిఫెన్స్ సెక్రటరీ మృతి పట్ల విదేశాంగ మంత్రి సంతాపం

By Rajesh KarampooriFirst Published Oct 26, 2022, 2:21 AM IST
Highlights

అమెరికా మాజీ డిఫెన్స్‌ సెక్రటరీ యాష్‌ కార్టర్‌ మరణవార్త తెలిసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని విదేశాంగ మంత్రి జైశంకర్‌ ట్వీట్‌ చేశారు. రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలకు కార్టర్ బలమైన మద్దతుదారని చెప్పాడు. అతను ప్రపంచ వ్యూహకర్త అని కీర్తించారు. యాష్‌ కార్టర్‌  బోస్టన్‌లో సోమవారం రాత్రి హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. 

అమెరికా మాజీ రక్షణ కార్యదర్శి యాష్‌ కార్టర్‌ మృతికి విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ సంతాపం తెలిపారు. భారత్‌-అమెరికా రక్షణ సంబంధాలకు బలమైన మద్దతుదారని అభివర్ణించారు. 68 ఏళ్ల కార్టర్ ఒబామా పాలనలో చివరి రెండేళ్లలో రక్షణ కార్యదర్శిగా పనిచేశారు. అతని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బోస్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సోమవారం రాత్రి ఆయన గుండెపోటుతో మరణించారు.

జైశంకర్ తన ట్వీట్‌లో.."అమెరికా మాజీ డిఫెన్స్ సెక్రటరీ యాష్ కార్టర్ మరణవార్త తెలిసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలకు కార్టర్ బలమైన మద్దతుదారుడని, ఆయన మాటలు స్ఫూర్తిదాయకమైన ప్రపంచ వ్యూహకర్త అని ఆయన అన్నారు.

అదే సమయంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం  బ్రిటిష్ విదేశాంగ మంత్రి  జేమ్స్ చర్చించారు. మంగళవారం నాడు బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునక్ బాధ్యతలు స్వీకరించిన తరుణంలో వీరిద్దరి మధ్య ఈ సంభాషణ జరిగింది. సునక్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో విదేశాంగ మంత్రిగా వ్యవహరించనున్న జెమ్స్ ను  అభినందించారు.

ఈ  సందర్భంగా ఉగ్రవాద వ్యతిరేకత, ద్వైపాక్షిక సంబంధాలు, ఉక్రెయిన్ వివాదంపై చర్చించినట్లు తన ట్వీట్‌లో తెలిపారు.అదే సమయంలో ఈ రోజు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాట్లాడటం చాలా మంచిదని తెలివిగా చెప్పారు. మేము రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం గురించి చర్చించామని బ్రిటిష్ విదేశాంగ మంత్రి ట్విట్ చేశారు. 

click me!