కరోనాకు వ్యాక్సిన్... జంతువులపై వ్యాక్సిన్: చైనా శాస్త్రవేత్తల పరిశోధన

By Siva Kodati  |  First Published Apr 22, 2020, 8:29 PM IST

చైనాలో పుట్టిన కరోనా వైరస్ మహమ్మారిలా మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని ఎదుర్కోవడానికి మానవజాతి నానా తంటాలు పడుతోంది. కోవిడ్ 19 బారినపడి ఇప్పటికే లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోగా.. 25 లక్షల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు


చైనాలో పుట్టిన కరోనా వైరస్ మహమ్మారిలా మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని ఎదుర్కోవడానికి మానవజాతి నానా తంటాలు పడుతోంది. కోవిడ్ 19 బారినపడి ఇప్పటికే లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోగా.. 25 లక్షల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

వైరస్ వ్యాప్తిని నివారించడానికి లాక్‌డౌన్, సోషల్ డిస్టెన్సింగ్ లాంటి చర్యలతో కంటికి కనిపించని సూక్ష్మజీవితో ప్రపంచం యుద్ధం చేస్తోంది. వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

Latest Videos

Also Read:కరోనా వైరస్ ఎక్కడ అభివృద్ధి చేశారో ఆధారాలతో రావాలి: చైనాకు అమెరికా వార్నింగ్

కానీ ఇంత వరకు ఫలితం మాత్రం శూన్యం. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 70 కరోనా వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి.

3 వ్యాక్సిన్లు మనుషులపై ప్రయోగాల దశలో ఉన్నాయి. మరోవైపు తాము ఇప్పటికే కోతులు, ఎలుకలపై నిర్వహించిన తొలి దశ వ్యాక్సిన్ ప్రయోగాలు విజయవంతం అయ్యాయని చైనా పరిశోధకులు తెలిపారు. ఈ సందర్భంగా జంతువుల శరీరాల్లో కోవిడ్ 19 యాంటీ బాడీస్‌ను ఉత్పత్తి అయినట్లు గుర్తించామన్నారు.

Also Read:కరోనా పాజిటివ్ వ్యక్తితో మీటింగ్.. ఇమ్రాన్ ఖాన్ కి పరీక్షలు

కోతులకు 3 మైక్రో గ్రాములు, 6 మైక్రో గ్రాముల చొప్పున రెండు డోసుల వ్యాక్సిన్‌ ఇవ్వడం ద్వారా వాటికి కరోనా నుంచి పూర్తిగా లేదా పాక్షికంగా రక్షణ లభించిందని... వైరస్ కోసం రూపొందించిన ఈ వ్యాక్సిన్ మరో పది రకాల వైరస్‌లను నాశనం చేస్తోందని ఈ అధ్యయనంలో గుర్తించినట్లు చైనా పరిశోధకులు వెల్లడించారు. 

click me!