కరోనా వైరస్ ఎక్కడ అభివృద్ధి చేశారో ఆధారాలతో రావాలి: చైనాకు అమెరికా వార్నింగ్

By narsimha lode  |  First Published Apr 22, 2020, 5:40 PM IST

రోనా వైరస్‌‌ను ఎక్కడ ఎలా అభివృద్ధి చేశారో  అసలైన ఆధారాలతో ముందుకు రావాలని అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు రాబర్ట్ ఓబ్రెయిన్ చైనాను కోరారు.చైనాలో గత ఏడాది చివర్లో కరోనా వైరస్ లక్షణాలతో రోగులు ఆసుపత్రుల్లో చేరారు. చైనా నుండే పలు దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది.
 


వాషింగ్టన్: కరోనా వైరస్‌‌ను ఎక్కడ ఎలా అభివృద్ధి చేశారో  అసలైన ఆధారాలతో ముందుకు రావాలని అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు రాబర్ట్ ఓబ్రెయిన్ చైనాను కోరారు.చైనాలో గత ఏడాది చివర్లో కరోనా వైరస్ లక్షణాలతో రోగులు ఆసుపత్రుల్లో చేరారు. చైనా నుండే పలు దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది.

ప్రపంచంలోని 200కు పైగా దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది. బుధవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 25,76,137 మందికి కరోనా సోకింది. ఈ వైరస్ సోకినవారిలో 1,78,677 మంది మృతి చెందారు. ఈ వైరస్ సోకి 7,04,184 మంది కోలుకొన్నారు.

Latest Videos

undefined

కరోనాను అరికట్టడంలో చైనా సరిగా వ్యవహరించలేదని చైనాపై పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఆ దేశంపై ఒత్తిడి నెలకొందని ఓబ్రెయిన్ చెప్పారు.వైరస్ ఎక్కడ తయారైందో నిజమైన ఆధారాలతో ముందుకు రావాల్సిన ఒత్తిడి చైనాపై ఉందని ఓబ్రెయిన్ అభిప్రాయపడ్డారు.

also read:కరోనా పాజిటివ్ వ్యక్తితో మీటింగ్.. ఇమ్రాన్ ఖాన్ కి పరీక్షలు

చైనాకు విదేశీ వ్యాధి నియంత్రణ నిపుణుల బృందం వచ్చి పరిశీలన చేస్తామంటే చైనా తిరస్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈ వైరస్ ను ఎక్కడ అభివృద్ది చేశారో చెప్పాల్సిన భాద్యత చైనాపై ఉందన్నారు. 

కరోనాతో తాము కోల్పోయిన డబ్బులను చెల్లించాలని కొన్ని దేశాలు చైనాపై కేసులు వేసిన విషయాన్ని ఆయన మీడియా సమావేశంలో ప్రస్తావించారు.తమతో పాటు మరికొన్ని దేశాలు కరోనా విషయంలో చైనాను బాధ్యురాలిని చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

click me!