ఉక్రెయిన్ కు అమెరికా స్విచ్ బ్లేడ్ ఆత్మాహుతి డ్రోన్లు.. రష్యాకు షాక్..

Published : Mar 18, 2022, 06:44 AM ISTUpdated : Mar 18, 2022, 06:45 AM IST
ఉక్రెయిన్ కు అమెరికా స్విచ్ బ్లేడ్ ఆత్మాహుతి డ్రోన్లు.. రష్యాకు షాక్..

సారాంశం

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ వైపు నిలబడ్డ అమెరికా దానికి అవసరమైనవిధంగా సహాయాన్ని అందిస్తోంది. తాజాగా స్విచ్ బ్లేడ్ డ్రోన్లను అందించనుంది. దీంతో యుద్ధంలో రష్యాకు పెద్ద ఎదురుదెబ్బ కానుంది. 

Ukraine కు అవసరమైన సైనిక సహాయాన్ని Americaమెల్లిగా పెంచుతోంది. ఇప్పటికే జావెలిన్, స్టింగర్ తో ఉక్రెయిన్ డిఫెన్స్ ను  బలోపేతం చేసిన అమెరికా…తాజాగా Switch blade ఆత్మహుతి డ్రోన్ లను అందజేయనుంది. నిన్న ప్రకటించిన సైనిక సహాయంలో ఇవి కూడా ఉన్నట్లు సమాచారం. ఈ droneలు  రష్యా సైనిక వాహనాల కదలికలను, కాన్వాయ్ లను దారుణంగా దెబ్బ తీయవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే Anti-tank guided missileలతో  రష్యన్ల  ట్యాంకులను  దారుణంగా దెబ్బ తీస్తున్న ఉక్రెయిన్ కు మరో అస్త్రం అందినట్లు అయింది. Switch blade dronesతో కొన్ని కిలోమీటర్ల ముందు నుంచే శత్రువుల పై విరుచుకు పడే అవకాశాన్ని ఈడ్రోన్లు కల్పిస్తాయి.

ఏమిటి ఆత్మహుతి ఆయుధం?
 అమెరికాకు చెందిన ఏరో వైర్మాన్మెంట్ సంస్థ ది  స్విచ్ బ్లేడ్ పేరుతో లను తయారు చేస్తోంది.  దీనిలో స్విచ్ బ్లేడ్ 300, స్విచ్ బ్లేడ్ 600  రకాలు ఉన్నాయి. థియేటర్ల విమానం సైజులో వుండవు. ఇది అతి చిన్న సైజులో ఉన్నా లాయిటరింగ్ మ్యూనిషన్ ( గాలిలో చక్కర్లు కొడుతూ..లక్ష్యం కనిపించగానే  దానిపై దాడి చేసేది)  వీటిని కామికాజె ( ఆత్మాహుతి) డ్రోన్ల కేటగిరిగా పేర్కొంటారు. ఈ డ్రోన్లను సైనికుడు బ్యాక్ పాక్ లో పెట్టుకుని కూడా ప్రయాణించవచ్చు. ఈ డ్రోన్లను కొండల్లో, సముద్రాల్లో, గాలిలో నుంచి  శత్రువు కు దూరంగా ఉండి ప్రయోగించవచ్చు.  ప్రయోగించిన తర్వాతే  దీని  రెక్కలు  విచ్చుకునే  గాలిలో  డ్రోన్ లాగా ఎగురుతుంది.  అందుకే స్విచ్ బ్లేడ్  అని పేరు పెట్టారు.

 ఇది ఒక సైనిక వాహనాన్ని పది కిలోమీటర్ల దూరం నుంచి ధ్వంసం చేసే అవకాశం కల్పిస్తుంది. అంతే కాదు దీని ఆపరేటర్కు  రియల్ టైం వీడియో లింకును కూడా అందిస్తుంది.  ఆపరేటర్కు  యుద్ధక్షేత్రం పై పూర్తి అవగాహన కల్పిస్తుంది. ఈ డ్రోన్ ను  ప్రత్యేకమైన ట్యూబ్ నుంచి లాంఛ్ చేయవచ్చు. స్విచ్ బ్లేడ్ 300 డ్రోన్లు కేవలం 2.5 కిలోల బరువు మాత్రమే ఉంటాయి.  వీటి పొడవు24 అంగుళాలు. ఇవి  పది కిలోమీటర్ల అవతల లక్ష్యాలను  ఛేదిస్తాయి. ఇది 500 500 అడుగుల కంటే తక్కువ ఎత్తులో 10 నిమిషాలలో గాలిలో ఎగరగలవు ఈ గ్రూపును కేవలం రెండు నిమిషాలలో ప్రయోగానికి సిద్ధం చేయవచ్చు దీనిలో కెమెరాలు కూడా ఉంటాయి.

కానీ మరో చిన్న కెమెరా డ్రోన్ ను దీనికి సహాయంగా తరచూ ఉపయోగిస్తుంటారు. ఈ రెండింటినీ సెన్సార్ టూ షూటర్ అనే సాఫ్ట్వేర్తో అనుసంధానిస్తారు. ఈ డోన్ లో పేలుడును ఆపరేటర్ నియంత్రించవచ్చు. కేవలం వాహనంలో లక్ష్యంగా మార్చుకున్న వ్యక్తిని మాత్రమే హాతమార్చేలా మార్చవచ్చు. దీని ధర 6,000  డాలర్ల వరకు ఉంది. అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్థాన్లో ఈ డ్రోన్లను తాలిబన్లపై దాడికి వాడింది.  ప్రస్తుతానికి  వీటిని అమెరికా మాత్రమే వినియోగిస్తుంది. ఖచ్చితమైన వీఐపీల లక్ష్యాలను  సేవించేందుకు వీటిని వినియోగిస్తారు.  ఆఫ్ఘనిస్తాన్ లో పుట్టిన వాహిబ్ నవాబీ ఏరో వైర్మాన్మెంట్ సీఈవోగా చేయడం విశేషం. ‘యాంగ్రీ బర్డ్’, ‘బజ్జింగ్ బీ’ లా  ఇది తాలిబన్లపై విరుచుకుపడింది అని ఆయన వెల్లడించారు.

40 కి.మీ  దూరంలో లక్ష్యాల కోసం స్విచ్ బ్లేడ్ 600
ఈ రకం  డ్రోన్లలలో 600 వేరియంట్ ను 40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఎందుకు వాడతారు. దీని బరువు 23 కిలోలు. దీనిలో డ్యూయల్ ఎలక్ట్రిక్  ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ సెన్సర్ సూట్ ను  అమర్చారు. దీనిపై యాంటీ ఆర్మర్ ( కవచాలను  చేదించే) వార్ హెడ్ ను అమర్చవచ్చు.  దీనిలో పేరు శక్తి నియంత్రించవచ్చు.  ముఖ్యంగా  సముద్రంలోని లక్ష్యాలను చేధించేందుకు వీటిని వాడతారు. స్విచ్ బ్లేడ్ డ్రోన్లు.. టర్కీకి చెందిన బైరక్తర్ టీబీ--2 డ్రోన్ల కంటే వేగంగా ప్రయాణిస్తాయి.  దీనిని పది నిమిషాల్లో దాడికి సిద్ధం చేయవచ్చు.  గంటకు 185 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణం చేయగలదు.  20 నిమిషాల్లో  40 కిలోమీటర్ల అవతల  లక్ష్యాన్ని ఛేదిస్తుంది.  దీని పైర్ కంట్రోల్ కోసం  టచ్ స్స్క్రీన్ టాబ్లెట్ ను వినియోగించవచ్చు..
 

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే