బిల్ గేట్స్ కి అమ్మాయిల పిచ్చి.. సంచలన ఆరోపణలు

Published : Jul 02, 2021, 10:40 AM IST
బిల్ గేట్స్ కి అమ్మాయిల పిచ్చి.. సంచలన ఆరోపణలు

సారాంశం

ఇక ఈ ప్రకటనపై.. బిల్‌ గేట్స్‌ ప్రతినిధి ఒకరు మండిపడ్డారు. విడాకుల ప్రకటన తర్వాతే ఇలాంటి అసత్యమైన, అసంబద్ధమైన ప్రకటనలు వెలువడడం దారుణమని ఆక్షేపించారు.   

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఇటీవల తన భార్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విడాకులు వ్యవహారం తీవ్ర సంచలనం రేపింది. అయితే... ఈ విడాకుల తర్వాత ఆయపై ఆరోపణలు ఎక్కువగా వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు  అమ్మాయిల పిచ్చి ఎక్కువ అంటూ జేమ్స్ వాల్లేస్ ఆరోపించడం గమనార్హం.

జేమ్స్‌ వాల్లేస్‌.. గేట్స్‌ మీద రెండు బయోగ్రఫీలు రాశాడు.అందులో 80, 90 దశకాల్లో మైక్రోసాఫ్ట్‌ తొలినాళ్లలో గేట్స్‌.. విపరీతంగా పార్టీలు నిర్వహించేవాడని, ఆ టైంలో తన పదిహేడు గంటల పని తీరును పక్కనపెట్టాడని వాల్లేస్‌ పేర్కొన్నాడు.

గేట్స్‌ లోకల్‌ నైట్‌ క్లబ్‌ల నుంచి అమ్మాయిల్ని పిలిపించుకునేవాడు. నగ్నంగా వాళ్లతో కలిసి ఈతలు కొట్టేవాడు. వాళ్ల చుట్టూ తిరిగేవాడు. తప్పతాగి జల్సాలు చేసేవాడని వాల్లేస్‌ ఆరోపించాడు. కొమ్‌డెక్స్‌, డెమో లాంటి సదస్సుల తర్వాత గేట్స్‌.. పార్టీల్లో పాల్గొనేవాడు. ఆ టైంలో బిల్‌గేట్స్‌ తప్పతాగే వాడని గతంలో రాబర్ట్‌ క్రింగ్లే అనే బ్లాగర్‌ రాసిన కథనాన్ని ప్రస్తావించాడు వాల్లేస్‌. 

ఇక ఈ ప్రకటనపై.. బిల్‌ గేట్స్‌ ప్రతినిధి ఒకరు మండిపడ్డారు. విడాకుల ప్రకటన తర్వాతే ఇలాంటి అసత్యమైన, అసంబద్ధమైన ప్రకటనలు వెలువడడం దారుణమని ఆక్షేపించారు. 

ఇక బిల్‌గేట్స్‌ పై మాజీ ఉన్నత ఉద్యోగి ఒకరు సంచలన ఆరోపణలకు దిగారు. ఓ ప్రముఖ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఉద్యోగి.. 1988లో ఓరోజు  ఉదయం ఓ మహిళపై వాలిపోయి కనిపించాడని, అప్పటికే మిలిండా గేట్స్‌తో ఆయన ప్రేమాయణం కొనసాగుతోందని ఆ ఉద్యోగి గుర్తు చేసుకున్నారు. ఇక మరో ఉద్యోగి బిల్‌గేట్స్‌ ఉద్యోగులందరితో సమానంగా ఉండేవాడు కాదని, తనకు నచ్చని వాళ్లపై అరిచేవాడని ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !