మాతో పెట్టుకొంటే తలపగులుతుంది: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్

Published : Jul 01, 2021, 04:42 PM IST
మాతో పెట్టుకొంటే తలపగులుతుంది: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్

సారాంశం

చైనాను లొంగదీసుకోవడం, బెదిరించడం, అణచివేయడం లాంటి ప్రయత్నాలను ఏ మాత్రం సహించమని ఆ దేశాధ్యక్షుడు జిన్‌సింగ్ తేల్చి చెప్పారు.

బీజింగ్: చైనాను లొంగదీసుకోవడం, బెదిరించడం, అణచివేయడం లాంటి ప్రయత్నాలను ఏ మాత్రం సహించమని ఆ దేశాధ్యక్షుడు జిన్‌సింగ్ తేల్చి చెప్పారు.తియన్మార్ స్వేర్  లో చైనా కమ్యూనిష్టు శత వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సభలో  పాల్గొన్న 70 వేల మందిని ఉద్దేశించి ఆయన  ప్రసంగించారు.

తైవాన్ సమస్య పరిష్కరానికి చైనా జాతీయ ప్రయోజనాలు, ప్రాదేశిక సార్వభౌమాత్వాన్ని కాపాడేందుకు దేశ ప్రజలకు ఉన్న శక్తి సామర్ధ్యాలను ఎవరూ కూడ తక్కువ అంచనా వేయవద్దని ఆయన కోరారు.చైనాను శాశ్వతంగా వేధించే రోజులు తొలగిపోయాయన్నారు.అలా చేయాలనుకొంటే 140 కోట్ల ప్రజలు సృష్టించిన ది గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్ ను ఢీకొని వారి తల పగులుతుందన్నారు.  

హాంకాంగ్, మకావ్ లో అత్యున్నత స్థాయిలో స్వయంప్రతిపత్తి కొనసాగుతోందన్నారు. పార్టీని ప్రజలను దూరం చేయాలని భావించినవారంతా ఓడిపోయారన్నారు.చైనా కమ్యూనిష్టు పార్టీ వందేళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా చైనా ఫైటర్ జెట్ విన్యాసాలు చేసింది.  సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సుమారు గంటకు పైగా పార్టీ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు ప్రసంగించారు. 
 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !