
Russia Ukraine Crisis: ప్రపంచదేశాలు భయపడినట్టుగానే ఉక్రెయిన్ పై రష్యా ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ కేపిటల్ కీవ్‌తోపాటు 20కి పైగా నగరాలపై బాంబుల దాడి చేస్తునట్టు తెలుస్తుంది. ఈ దాడిలో ప్రధానంగా. నగరాలను, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. వైమానిక దాడులతో పాటు సరిహద్దుల నుంచి యుద్ధ ట్యాంకులను కూడా ఉక్రెయిన్‌లోకి తరలిస్తోంది. మరోవైపు పెద్ద ఎత్తున పారా షూట్స్ తో సైనికులు రంగంలోకి దిగుతున్నారు. నలువైపుల నుంచి ఉక్రెయిన్‌ను చుట్టుముట్టి.. ముప్పేట దాడి చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే ఉక్రెయిన్ సైనిక స్థావరాలు ధ్వంసం అయ్యాయి. పెద్ద మొత్తంలో సైనికులతో పాటు 300 మంది పౌరులు చనిపోయినట్టు ఉక్రెయిన్ తెలిపింది.
ఈ క్రమంలో రష్యా మీద యూరోపియన్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బలమైన, కఠినమైన చర్య అని పేర్కొంది. ఈ రష్యా మిలిటరీ ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్నా.. తరుణంలో యూరోపియన్ యూనియన్
అత్యవసర శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ మాట్లాడుతూ.. ఐరోపాలో స్థిరత్వం, అంతర్జాతీయ శాంతి లక్ష్యం యూరోపియన్ యూనియన్ ఏర్పాటు జరిగిందనీ, కానీ ఆ సూత్రాలకు, ఆ ఆశయాలకు విరుద్దంగా రష్యా వ్యవహరించింది. ఈ దుశ్చర్యకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను జవాబుదారీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తుందనీ, రష్యాపై 'కఠినమైన' ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.
ఉక్రెయిన్ పై దాడి చేయడమే కాకుండా... ఉక్రెయిన్ సహకరించే వారిని బెదిరించడం సరైనది కాదనీ,
ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన మాత్రమే కాదనీ, మానవ ప్రాథమిక సూత్రాల ఉల్లంఘన అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలియని పరిణామాలతో చాలా మంది ప్రాణాలను బలిగొంటోందనీ, సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారనీ, యూరోపియన్ యూనియన్ ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తుందని ఆగ్రహం చేశారు.
EU నాయకులు వాన్ డెర్ లేయన్ మాట్లాడుతూ.. ఈ దాడితో అంతర్జాతీయ శాంతి దెబ్బ తిన్నడనీ, రష్యాకు కీలకమైన సాంకేతికతలు,మార్కెట్లకు ప్రాప్యతను నిరోధించడం ద్వారా రష్యన్ ఆర్థిక వ్యవస్థ యొక్క వ్యూహాత్మక రంగాలను లక్ష్యంగా చేసుకుంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ భాగస్వాములు, మిత్రదేశాలు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, కానీ జపాన్, ఆస్ట్రేలియాతో కూడా సన్నిహితంగా ఉన్నామని చెప్పారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని ప్రపంచ నాయకులు గురువారం పిలుపునిచ్చారు. ఈ తరుణంలో UN భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. యుద్దాన్ని తక్షణమే నిలువరించాలని విజ్ఞప్తి చేసింది.