
మాస్కో: Russia చెందిన సైనిక బలగాలు గురువారం నాడు Ukraine లోకి ప్రవేశించాయి,. రష్యన్ యుద్ధ ట్యాంకులు, ఇతర భారీ ఆయుధ సామాగ్రి గల వాహనాలు ఉత్తర ప్రాంతాల్లోని సరిహద్దును దాటి వచ్చాయని ఉక్రెయిన్ సరిహద్దు భద్రతా సిబ్బంది తెలిపారు.
ఇప్పటికే ఉక్రెయిన్ కు చెందిన ఎయిర్ బేస్, రక్షణకు చెందిన కీలక స్థావరాలను ధ్వంసం చేసినట్టుగా రష్యా ప్రకటించింది. మిలటరీ ఆపరేషన్ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఎయిర్ బేస్ సహా కీలక వ్యవస్థలను రష్యా నాశనం చేసింది.
వేర్పాటువాద తూర్పు ప్రాంతంలో రష్యా మద్దతుగల తిరుగుబాటుదారులతో ఎనిమిదేళ్ల పోరాటంలో ఉక్రెయిన్ భారీగా ప్రాణ నష్టాన్ని చవి చూసింది. అయితే కొన్నేళ్లుగా క్రిమియాతో దక్షిణ సరిహద్దుల్లో ఎలాంటి మరణాలు లేవు.
ఉక్రెయిన్ పై రష్యా గురువారం నాడు తెల్లవారుజాము నుండి మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించింది.ఉక్రెయిన్ సరిహద్దుల నుండి సుమారు లక్షన్నర నుండి రెండు లక్షల మంది సైనికులను మోహరించారు. నాటోలో ఉక్రెయిన్ ను చేర్చుకోవద్దని కోరుతుంది.
ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ప్రారంభించడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. Ukraine పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభిస్తున్నట్టుగా ఆ దేశాధ్యక్షుడు Vladmir Putin ప్రకటించారు. ఉక్రెయిన్ , రష్యా దళాల మధ్య ఘర్షణలు అనివార్యమైనట్టు ఆయన ప్రకటించారు.
ఉక్రెయిన్ పై మిలటరీ ఆపరేషన్ ను పుతిన్ రష్యా టెలివిజన్ లో ప్రసంగంలో సమర్ధించారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెంక్సీ ఈ విషయమై స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలు విఫలమయ్యాయని చెప్పారు. ఐరోపాలో పెద్ద యుద్ధానికి మద్దతు ఇవ్వవద్దని రష్యన్లకు అర్ధరాత్రి ఉద్వేగభరితంగా కోరారు.ఉక్రెయిన్ గురించి రష్యా ప్రజలకు అబద్దాలు చెబుతున్నారని ఆయన చెప్పారు. తాను పుతిన్ తో మాట్లాడేందుకు ప్రయత్నించానని చెప్పారు. అయితే సమాధానం లేదన్నారు. నిశ్శబ్దం మాత్రమే అని జెలెన్స్కీ చెప్పారు. ఉక్రెయిన్ సరిహద్దుల దగ్గర 2 లక్షల మంది సైనికులు ఉన్నారని ఆయన వివరించారు.
ఉక్రెయిన్ ప్రభుత్వం తమ దేశంలోని తూర్పు ప్రాంతంలోని మిమానాశ్రయాలను అర్ధరాత్రి 7 గంటల నుండి మూసివేసింది. ఉక్రెయిన్ అభ్యర్ధన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తోంది.
ఉక్రెయిన్ పై రష్యా దాడిని అన్యాయమైన దాడిగా అమెరికా అధ్యక్షుడు Joe Biden అభిప్రాయపడ్డారుఉక్రెయిన్ మిలటరీ ఆపరేషన్ కు రష్యా బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా తేల్చి చెప్పింది. రష్యా దాడికి ప్రతి చర్య తప్పదని జో బైడెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్ కు నాటో దళాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి.
ఉక్రెయిన్ పై తమ మిలటరీ చర్య విషయంలో ఇతరుల జోక్యాన్ని తాము సహించబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. జోక్యం చేసుకొన్న దేశాలు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని పుతిన్ హెచ్చరించారు.
దీంతో ఉక్రయిన్ లో అత్యవసర పరిస్థతిని విధించారు. తమ ఎయిర్ స్పేస్ ను ఉక్రెయిన్ మూసివేసింది. ఉక్రెయిన్ లో ఖార్కిస్, ఒడెస్సా, పోల్ లో మిస్సైల్స్ తో దాడులు చోటు చేసుకొన్నాయి. డోస్‌బాస్ లో ఉక్రెయిన్ బలగాలను వెనక్కి వెళ్లిపోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని చైనా ప్రకటించింది. ఇరు వర్గాలు సంయమనం పాటించాలని చైనా కోరింది.
ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో గురువారం నాడు దేశ ప్రజలనుద్దేశించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగించనున్నారు. ఈ దాడితో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని అమెరికా అభిప్రాయపడింది.
తూర్పు ఉక్రెయిన్ లో తిరుగుబాటు నాయకులు కీవ్ పై సైనిక సహాయం కోసం మాస్కోను కోరినట్టుగా క్రెమ్లిన్ ప్రకటించిన తర్వాత మిలటరీ ఆపరేషన్ ప్రారంభమైందని పుతిన్ ప్రకటించారు.