మరో కొత్త వైరస్ కలకలం.. ఈక్వటోరియల్ గినియాలో 9 మంది మృతి.. లక్షణాలు, వ్యాప్తి వివరాలు ఇవే..

Published : Feb 14, 2023, 05:11 PM IST
మరో కొత్త వైరస్ కలకలం.. ఈక్వటోరియల్ గినియాలో 9 మంది మృతి.. లక్షణాలు, వ్యాప్తి వివరాలు ఇవే..

సారాంశం

ప్రపంచంలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ఈక్వటోరియల్ గినియాలో మార్‌బర్గ్ వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది. 

ప్రపంచంలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ఈక్వటోరియల్ గినియాలో మార్‌బర్గ్ వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది. ఈ వైరస్‌ వ్యాప్తితో కనీసం తొమ్మిది మంది మరణిచారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ వైరస్ హెమరేజిక్ జ్వరాన్ని(ఇది తీవ్రమైన, ప్రాణాంతక అనారోగ్యానికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి) కలిగిస్తుందని.. ‘‘ఎబోలా’’ వ్యాధిని పోలి ఉంటుందని పేర్కొంది. తొమ్మిది మంది వ్యక్తుల నమూనాలు మార్‌బర్గ్ వైరస్‌కు పాజిటివ్‌గా నిర్దారణ అయిన తర్వాత సోమవారం (స్థానిక సమయం) ఈక్వటోరియల్ గినియా తన మొట్టమొదటి వ్యాప్తిని ధృవీకరించిందని డబ్ల్యూహెచ్‌వో ఒక ప్రకటనలో తెలిపింది. 

వైరస్ లక్షణాలను చూపించే వ్యక్తులను కాంటాక్ట్‌లను గుర్తించడానికి.. ఐసోలేట్ చేయడానికి, వైద్య సంరక్షణ అందించడానికి ముందస్తు బృందాలను ప్రభావిత జిల్లాల్లో మోహరించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి ఎపిడెమియాలజీ, కేస్ మేనేజ్‌మెంట్, ఇన్‌ఫెక్షన్ నివారణ, ల్యాబ్, రిస్క్ కమ్యూనికేషన్‌లో ఆరోగ్య అత్యవసర నిపుణులను అక్కడికి పంపేందుకు డబ్ల్యూహెచ్‌వో ప్రయత్నాలు చేస్తోంది. నమూనాల పరీక్ష కోసం ల్యాబొరేటరీ గ్లోవ్ టెంట్‌లను రవాణా చేయడంతోపాటు 500 మంది ఆరోగ్య కార్యకర్తలు ఉపయోగించగల వ్యక్తిగత రక్షణ పరికరాలను కలిగి ఉన్న ఒక వైరల్ హెమరేజిక్ ఫీవర్ కిట్‌ను కూడా పంపేందుకు సిద్దమైంది.

‘‘మార్‌బర్గ్ తీవ్రమైన అంటువ్యాధి. వ్యాధిని నిర్ధారించడంలో ఈక్వటోరియల్ గినియా అధికారుల వేగవంతమైన, నిర్ణయాత్మక చర్యకు ధన్యవాదాలు. అత్యవసర ప్రతిస్పందన త్వరగా చేపట్టడం ద్వారా మేము ప్రాణాలను కాపాడుతాము. వీలైనంత త్వరగా వైరస్‌ వ్యాప్తిని ఆపివేస్తాము’’ డబ్ల్యూహెచ్‌వో ఆఫ్రికా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ మట్షిడిసో తెలిపారు. 

ఇక, డబ్ల్యూహెచ్‌వో ప్రకారం.. మార్‌బర్గ్ వైరస్ వ్యాధి 88 శాతం వరకు మరణాల నిష్పత్తితో అత్యంత తీవ్రమైన వ్యాధి. ఇది ఎబోలా వైరస్ వ్యాధికి కారణమయ్యే వైరస్ ఉన్న కుటుంబంలోనే ఉంది. మార్‌బర్గ్ వైరస్ వల్ల ఆకస్మాత్తుగా అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, తీవ్రమైన అనారోగ్యం ప్రారంభమవుతుంది. చాలా మంది రోగులలో ఏడు రోజులలో తీవ్రమైన రక్తస్రావ లక్షణాలు కనిపించేందుకు అవకాశం ఉంటుంది.

ఈ వైరస్ ఫ్రూట్ గబ్బిలాల నుంచి ప్రజలకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తుల శరీర ద్రవాలు, ఉపరితలాలు, పదార్థాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా మానవుల మధ్య వ్యాపిస్తుంది. ఇప్పటి వరకు ఈ వైరస్ చికిత్సకు టీకాలు లేదా చికిత్సలు కనుగొనబడలేదు. అయితే ఈ వైరస్‌ను ఎదుర్కొనేలా సహాయక సంరక్షణ ఉంది.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే