
వాషింగ్టన్: అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలో దుండగుడు కాల్పులకు దిగాడు.ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు.నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
సోమవారం నాడు రాత్రి ఓ దుండగుడు కాల్పులకు దిగాడు. ఈస్ట్ లాన్సింగ్ లోని ప్రధాన క్యాంపస్ లో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.బర్కీహల్ , మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ అకాడమిక్ భవనం వద్ద దుండగుడు కాల్పులకు దిగినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఈ కాల్పుల ఘటనలో ముగ్గురు మృతి చెందినట్టుగా పోలీసులు ధృవీకరించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి కూడా తీవ్రంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాల్పులకు దిగిన దుండగుడి కోసం పోలీసులు క్యాంపస్ లో గాలింపు చర్యలు చేపట్టాయి.
కాల్పులు జరిపిన దుండగుడు ముసుగు ధరించి ఉన్నాడని పోలీసులు చెప్పారు. ఎంఎస్ యూ భవనం నుండి నిందితుడు పారిపోతున్నట్టుగా కన్పించాడని పోలీసులు చెప్పారు.ఎంఎస్ యూ అనేది ప్రధాన ప్రభుత్వ విద్యా సంస్థ.ఈ క్యాంపస్ లో 50 వేల మంది గ్రాడ్యుయేట్లు, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులుంటారు. మరో 48 గంటలపాటు ఈ క్యాంపస్ లో అన్ని తరగతులను రద్దు చేసినట్టుగా పోలీసులు వివరించారు.