త్వరలోనే ఇండియాకు విజయ్ మాల్యా అప్పగింత

By narsimha lodeFirst Published Jun 4, 2020, 11:24 AM IST
Highlights

 పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను ఇండియాకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు న్యాయపరమైన ప్రక్రియ పూర్తైందని తెలుస్తోంది.
 

న్యూఢిల్లీ: పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను ఇండియాకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు న్యాయపరమైన ప్రక్రియ పూర్తైందని తెలుస్తోంది.

తనను భారత్ కు అప్పగించకూడదని విజయ్ మాల్యా చేసిన ధరఖాస్తును బ్రిటన్ ఉన్నత న్యాయస్థానం గత నెల 14 వ తేదీన తోసిపుచ్చింది.
విజయ్ మాల్యాను విచారణ నిమిత్తం ఇండియాకు తీసుకొచ్చేందుకు సీబీఐ, ఈడీ అధికారులు కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

నిబంధనల ప్రకారంగా మే 14 నుండి 28 రోజుల్లోగా నిందితుడిని ఇండియాకు పంపే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే 20 రోజులు గడిచిపోయాయి. ఇండియాలో పలు బ్యాంకులను సుమారు రూ. 9 వేల కోట్లను విజయ్ మాల్యా మోసం చేశారని ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ విషయమై సీబీఐ, ఈడీలు కేసులు నమోదు చేశాయి.

విజయ్ మాల్యా  2016 మార్చి 2న యూకేకు పారిపోయాడు. 2019 జనవరిలో అర్ధిక అపరాధిగా ప్రకటించింది ఇండియా. విజయ్ మాల్యాను ఇండియాకు అప్పగించే ప్రక్రియకు సంబంధించిన పత్రాలపై యూకే హోం సెక్రటరీ ఇంకా సంతకం చేయలేదని సమాచారం. ఈ సంతకం పూర్తైతే మాల్యాను ఇండియాకు అప్పగించే ప్రక్రియ దాదాపుగా పూర్తైనట్టేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కూడ పలు బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. భారతీయ బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన వారిని రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. 

click me!