గుడ్‌న్యూస్: కరోనా రోగులకు హైడ్రాక్సీక్లోరోక్విన్ వినియోగానికి డబ్ల్యుహెచ్ఓ గ్రీన్ సిగ్నల్

By narsimha lodeFirst Published Jun 4, 2020, 10:51 AM IST
Highlights

కరోనా రోగులకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ను వినియోగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. కరోనా రోగులకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ను ఉపయోగించకూడదని గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిషేధం విధించిన విషయం తెలిసిందే.


జెనీవా: కరోనా రోగులకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ను వినియోగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. కరోనా రోగులకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ను ఉపయోగించకూడదని గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిషేధం విధించిన విషయం తెలిసిందే.

 హైడ్రాక్సీక్లోరోక్విన్ సంబంధించిన సేఫ్టీ డేటాను నిపుణులు పరిశీలించారు. ఆ తర్వాతే క్లినికల్ ట్రయల్స్ ను కొనసాగించేందుకు అనుమతి ఇస్తున్నామని బుధవారం నాడు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్  తెలిపారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం కోసం ఎన్ రోల్ అయిన రోగులకు డాక్టర్లు హైడ్రాక్సీక్లోరోక్విన్ ను ఉపయోగించవచ్చు.ఈ ఏడాది మే 25వ తేదీన హైడ్రాక్సీక్లోరోక్విన్ ను ఉపయోగించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.

also read:ఇండియాలో ఒక్క రోజులోనే అత్యధికంగా 9,304 కరోనా కేసులు: మొత్తం 2,16,919కి చేరిక

హైడ్రాక్సీక్లోరోక్విన్ ఉపయోగించడం వల్ల కరోనా రోగుల్లో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని లాన్సెట్ మెడికల్ జనరల్ లో అధ్యయనం ప్రకటించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం తీసుకొంది.

మలేరియా చికిత్స కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్ ను సాధారణంగా ఉపయోగిస్తారు. ఈ మందును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడ వినియోగించాడు. తాను రోజూ ఈ మందును ఉపయోగిస్తున్నట్టుగా ఆయన ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఉపయోగించిన రోగుల్లో మంచి ఫలితాలు రావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. 

click me!