జార్జ్ సోరోస్‌ మానవత్వాన్ని ద్వేషిస్తారు.. సమాజాన్ని నాశనం చేసే పనులు చేస్తారు: మస్క్ సంచలనం

By Sumanth Kanukula  |  First Published Nov 1, 2023, 10:46 AM IST

బిలియనీర్ జార్జ్ సోరోస్‌పై టెస్లా అధినేత, ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోరోస్ మానవత్వాన్ని ద్వేషిస్తాడరని అన్నారు.


బిలియనీర్ జార్జ్ సోరోస్‌పై టెస్లా అధినేత, ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోరోస్ మానవత్వాన్ని ద్వేషిస్తాడరని విమర్శించారు. నేరాల పట్ల మృదువుగా ఉండే డిస్ట్రిక్ట్ అటార్నీలను ఎన్నుకోవడంలో సహాయపడటానికి పదేపదే పని చేశారని ఆరోపించారు. ప్రోగ్రెసివ్ ప్రాసిక్యూటర్‌లకు ఆర్థిక సహాయం చేయడానికి, చట్టబద్ధం చేయడానికి సోరోస్ చేసిన ప్రయత్నాలు అనేక యూఎస్ నగరాలపై గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని చూపాయని మస్క్ చెప్పారు. సోరోస్ ఇతర దేశాలలో కూడా ఈ పనులు చేశాడని ఆరోపించారు. ది జో రోగన్ ఎక్స్‌పీరియన్స్ పోడ్‌కాస్ట్‌లో ఎలాన్ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

తన అభిప్రాయం ప్రకారం.. సోరోస్ ప్రాథమికంగా మానవత్వాన్ని ద్వేషిస్తారని అన్నారు. ఆయన నాగరికత సమాజాన్ని నాశనం చేసే పనులు చేస్తున్నాడని విమర్శించారు.  నేరాన్ని విచారించడానికి నిరాకరించే డీఏలను ఎన్నకోవడం.. శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెల్స్‌లో సమస్యలో భాగంగా ఉందన్నారు.  చట్టాలను సమర్థించడంలో పదేపదే విఫలమయ్యే డిస్ట్రిక్ట్ అటార్నీలు చట్టాలను మార్చడానికి సత్వరమార్గ వ్యూహాన్ని సూచిస్తారని విమర్శించారు. అయితే సోషల్ మీడియాలో మాస్క్ వ్యాఖ్యలతో పలువురు ఏకీభవించారు. 

Latest Videos

undefined

 

🔊 ... "George Soros is the top contributor to the Democratic Party, the second was Sam Bankman-Fried"

"I think George Soros fundamentally hates humanity. He is doing things that erode the fabric of society, getting DAs elected that won't do their jobs."

"He is doing things in… pic.twitter.com/mFk60X3gn8

— Wall Street Silver (@WallStreetSilv)

జార్జ్ సోరోస్ డెమొక్రాటిక్ పార్టీకి అతిపెద్ద కంట్రిబ్యూటర్ అని.. రెండో స్థానంలో సామ్ బ్యాంక్‌మన్-ఫ్రైడ్ ఉన్నారని ఎలాన్ మస్క్ అన్నారు. 

click me!