పంజరం శుభ్రం చేస్తుండగా.. చిలుకలు ఎగిరిపోయాయని...

Published : Jun 04, 2020, 09:50 AM IST
పంజరం శుభ్రం చేస్తుండగా.. చిలుకలు ఎగిరిపోయాయని...

సారాంశం

ఆ చిన్నారి వయసు ఎనిమిది సంవత్సరాలు. కాగా..  ఆ దుకాణంలో పంజరాలు శుభ్రం చేస్తుండగా అందులోని చిలకలు ఎగిరిపోయాయి.  దీంతో.. ఖరీదైన చిలకలు ఎగిరిపోవడంతో ఆ ఇంటి యజమాని పాప మీద ఆగ్రహించాడు.

పంజరం శుభ్రం చేస్తుండగా చిలుకలు ఎగిరిపోయానని ఓ చిన్నారిని అతి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ సంఘటన పాకిస్థాన్ లోని ఇస్లామా బాద్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఇస్లామా బాద్ లో ఓ చిన్నారి చిలకలు అమ్మే దుకాణంలో పనిచేస్తోంది. ఆ చిన్నారి వయసు ఎనిమిది సంవత్సరాలు. కాగా..  ఆ దుకాణంలో పంజరాలు శుభ్రం చేస్తుండగా అందులోని చిలకలు ఎగిరిపోయాయి.  దీంతో.. ఖరీదైన చిలకలు ఎగిరిపోవడంతో ఆ ఇంటి యజమాని పాప మీద ఆగ్రహించాడు. కనీసం పసి పిల్ల అని కూడా కనికరించలేదు.

వెంటనే ఆ చిన్నారిని అతి కిరాతకంగా విచక్షణా రహితంగా కొట్టాడు. తీవ్రగాయాలపాలైన చిన్నారిని ఆస్పత్రిలో చేర్పిచంగా.. చికిత్స పొందుతూ కన్నుమూసింది. కాగా.. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా... ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !