కరోనా వైరస్ లో పస తగ్గిందన్న ఇటలీ డాక్టర్, అందులో వాస్తవమెంత...?

By Sree s  |  First Published Jun 2, 2020, 11:15 AM IST

కరోనా వైరస్ లో శక్తి, పస తగ్గిపోయాయని నిన్న ఒక ప్రఖ్యాత ఇటలీ డాక్టర్ ప్రకటించిన నేపథ్యంలో.... తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చింది. కరోనా వైరస్ మునపటిలాగే అంతే శక్తివంతంగా ప్రజల ప్రాణాలను తీస్తుందని, ఆ డాక్టర్ చేసిన వ్యాఖ్యలను సమర్థించే శాస్త్రీయ అధ్యయనం ఏది లేదని అన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్యులు. 


కరోనా వైరస్ లో శక్తి, పస తగ్గిపోయాయని నిన్న ఒక ప్రఖ్యాత ఇటలీ డాక్టర్ ప్రకటించిన నేపథ్యంలో.... తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చింది. కరోనా వైరస్ మునపటిలాగే అంతే శక్తివంతంగా ప్రజల ప్రాణాలను తీస్తుందని, ఆ డాక్టర్ చేసిన వ్యాఖ్యలను సమర్థించే శాస్త్రీయ అధ్యయనం ఏది లేదని అన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్యులు. 

ఇటలీకి చెందిన ప్రఖ్యాత వైద్యుడు, అల్బెర్టో జాన్గ్రిల్లో కరోనా కోవిడ్ ని కలిగించే కరోనా వైరస్ రూపాంతరం చెందిందని, ప్రస్తుతం రూపాంతరం చెందిన వైరస్ తొలినాళ్ళలో దాడిచేసిన వైరస్ అంత ప్రమాదకారి కాదని, అసలు అప్పటి వైరసే ఇప్పుడు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 

Latest Videos

undefined

ఇటలీలోని అత్యధిక కేసులను డీల్ చేసిన ఆసుపత్రి ఐసీయూ కి ఈ డాక్టర్ హెడ్. ఈయన మాటను కూడా సాధ సీదా గా తీసుకోలేము. అందుకే ఈయన వ్యాఖ్యలను ప్రపంచంలోని అన్ని మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి. 

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ యన వ్యాఖ్యలను తోసిపుచ్చింది. శాస్త్రీయ అధ్యనం లేకుండా ఎటువంటి నిర్ణయానికి మనం రాకూడదని వారు అంటున్నారు. కరోనా వైరస్ రూపాంతరం చెందుతుందని చెప్పడానికి సరైన ఆధారాల్లేవని, అందుకే దీనిపై ఒక నిర్ణయానికి రాకూడదని వారు అంటున్నారు. 

ఇటలీ వైద్యుడు మాత్రం తాను అధ్యయనం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలేదని, మరో సహ వైద్యుడు చేసిన అధ్యయనం ఆధారంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ శనివారం ఆ రీసర్చ్ కి సంబంధించిన పూర్తి వివరాలు ప్రచురిస్తామని అన్నారు. 

ఇదిలా ఉండగా, భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. వరసగా రెండు రోజుల పాటు 8వేల పై చిలుకు కేసులు నమోదవ్వగా.. సోమవారం కూడా 8వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. శనివారం  8,380 కరోనా కేసులు నమోదయితే, ఆదివారం 8,392 కేసులు నమోదయ్యాయి. కాగా సోమవారం 8,171 కేసులు నమోదవ్వడం గమనార్హం.

 మొత్తం కేసుల సంఖ్యా లక్షా తొంభై వెలను దాటాయి. ఇప్పటి వరకు దేశంలో 1,98,706 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి 5,598 మంది మరణించారు. 

ఇకపోతే.... భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. లాక్ డౌన్ ను కూడా సడలించడంతో కేసుల సంఖ్యా అంతకంతకు పెరుగుతూ ఏ రోజుకారోజు అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. 

click me!