చదువుకోవడానికి చర్చికి వెళితే... అత్యాచారం చేసి...

By telugu news teamFirst Published Jun 4, 2020, 7:47 AM IST
Highlights

కొద్ది గంటల తర్వాత చర్చి సెక్యూరిటి గార్డు లోపలకు వచ్చి చూడగా.. రక్తపు మడుగులో వెరా ఉవైలా పడి ఉంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమెపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్థారించారు. 

చదువుకోవడానికి చర్చికి వెళ్లిన ఓ యువతి పై అతి క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను అక్కడికక్కడే హత్య చేశారు. ఈ దారుణ సంఘటన నైజీరియాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బెనిన్ సెటికి చెందిన వెరా ఉవైలా ఒమోజువా(22) అనే యువతి యూనివర్శిటి ఆఫ్ బెనిన్‌లో మైక్రోబయాలజీ చదువుతోంది. బుధవారం బెనిన్ సిటీలో ఖాళీగా ఉన్న రిడీమ్డ్ క్రీస్టియన్ చర్చ్ ఆఫ్ గాడ్(ఆర్‌సీసీజీ) చర్చికి చదువుకుందాం అని వెరా ఉవైలా వెళ్లింది. కొద్ది గంటల తర్వాత చర్చి సెక్యూరిటి గార్డు లోపలకు వచ్చి చూడగా.. రక్తపు మడుగులో వెరా ఉవైలా పడి ఉంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమెపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్థారించారు. 

అత్యాచారం చేసి ఎవరో హత్యాయత్నానికి పాల్పడినట్టు వైద్యులు చెప్పారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతూనే వెరా ఉవైలా ప్రాణాలు విడిచింది. వెరా ఉవైలా మరణం తరువాత నైజీరియాలో వందలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. వెరా ఉవైలా మరణానికి తగిన న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. 

కేసు నమోదు చేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని మరోపక్క పోలీసులు చెప్పారు. ఆర్‌సీసీజీ చర్చి కూడా దీనిపై స్పందించింది. చర్చి గ్లోబల్ లీడర్ అయిన పాస్టర్ ఎనోచ్ అడెబోయ్ ఈ హత్యను ఖండించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులతో కలిసి పనిచేస్తున్నామని.. త్వరలోనే నిందితులు దొరుకుతారని ఆశిస్తున్నట్టు చెప్పారు.

click me!