వరుస భూకంపాలతో వణికిపోయిన ఆఫ్ఘనిస్తాన్.. 320 మంది మృతి..500మందికి పైగా గాయాలు!

By Rajesh Karampoori  |  First Published Oct 8, 2023, 5:20 AM IST

Earthquake: కేవలం అరగంట వ్యవధిలో వరుసగా మూడు భూకంపాలు సంభవించడంతో ఆఫ్ఘనిస్తాన్‌ను అతలాకుతలమైంది. శనివారం సంభవించిన ఈ భూప్రకంపనలకు ఆఫ్ఘాన్ వాసులు భయాందోళనకు గురయ్యారు. ఈ విప్తత్కర పరిస్థితుల్లో దాదాపు 320 మంది మరణించిన ఉండవచ్చనీ, 500 మందికి పైగా గాయపడి ఉండవచ్చని అంచనా.


Earthquake: వరుస భూకంపాలతో ఆఫ్ఘనిస్తాన్‌ అతలాకుతమైంది.  శనివారం సంభవించిన ఈ భూప్రకంపనలకు ఆఫ్ఘాన్ వాసులు భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని రోడ్లపై పరుగులు దీశారు. ఈ భూకంపం తీవ్రతను యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భారీ తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం భారీ ప్రాణ నష్టం,ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ఐక్యరాజ్యసమితి ప్రాథమికంగా 320 మంది మరణించినట్లు వెల్లడించింది. అయితే.. గణాంకాలు ఇంకా ధృవీకరించబడలేదు. హెరాత్ ప్రావిన్స్ ఎక్కువగా ప్రభావితమైంది. భూకంపం కారణంగా వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

నేషనల్ డిజాస్టర్ అథారిటీ ప్రకారం.. దాదాపు 100 మరణించి ఉండవచ్చనీ, 500 మంది గాయపడినట్లు అంచనా వేసింది. ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో మొదటి భూకంపం శనివారం మధ్యాహ్నం 12:11 గంటలకు సంభవించింది. ఆ తర్వాత 12.19 గంటలకు 5.6 తీవ్రతతో రెండో భూకంపం , 12.42 లకు మూడవ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిచ్టర్‌పై 6.3గా నమోదైందని తెలిపింది.  

Latest Videos

యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూకంప కేంద్రం హెరాత్‌కు వాయువ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాత్రి 11 నుంచి 1 గంటల మధ్య 4.6 నుంచి 6.3 తీవ్రతతో మొత్తం ఐదు ప్రకంపనలు సంభవించాయని తెలిపింది. భూకంపం వల్ల ఎక్కువగా ప్రభావితమైన హెరాత్ ప్రావిన్స్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ మహ్మద్ తలేబ్ షాహిద్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆసుపత్రికి తీసుకువచ్చిన వ్యక్తుల ఆధారంగా మరణించిన , గాయపడిన వారి గణాంకాలను విడుదల చేసినట్లు తెలిపారు. శిథిలాల నుంచి ప్రజలను బయటకు తీస్తేనే అసలు సంఖ్య తెలుస్తుంది.

click me!