అమెరికా లో విషాదం చోటు చేసుకుంది. న్యూజెర్సీలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతుల్లో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారంతా ఇంట్లోనే శవాలై కనిపించారు.
అమెరికాలో దారుణం జరిగింది. న్యూజెర్సీలో నివాసిస్తున్న భారతీయ సంతతికి చెందిన ఓ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతుల్లో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్య కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ప్లెయిన్స్‌బోరో పోలీసులు సమాచారం అందించారు. ప్లెయిన్స్‌బోరో పోలీస్ డిపార్ట్‌మెంట్ నుండి అందిన సమాచారం ప్రకారం.. 43 ఏళ్ల తేజ్ ప్రతాప్ సింగ్, 42 ఏళ్ల సోనాల్ పరిహార్, 10 ఏళ్ల కుమారుడు, 6 ఏళ్ల కుమార్తెతో కలిసి ప్లెయిన్స్ బోరోలోని ఓ ఇంట్లో నివసిస్తున్నారు.
ఈ క్రమంలో అక్టోబర్ 4 సాయంత్రం ప్లెయిన్స్‌బోరో పోలీస్ డిపార్ట్‌మెంట్ (Plainsboro Police Department) కంట్రోల్ రూమ్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అధికారులు అక్కడికి చేరుకున్నప్పుడు.. ప్లెయిన్‌బోరో పోలీసు డిపార్ట్‌మెంట్ ఇంట్లో నలుగురు వ్యక్తులు చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. ఈ సీరియస్ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, మృతదేహాలకు పోస్టుమార్టం చేశామని, ఈ కేసులో ఎలాంటి ప్రమాదం లేదని ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. సామూహిక హత్య ప్రస్తుతం విచారణలో ఉందని చెప్పారు. వీరి మృతికిగల కారణాలు తెలియరాలేదని తెలిపారుజ
undefined
ఈ ప్రాంత ప్రజలు దీనికి సంబంధించి ఏదైనా సమాచారం లేదా CCTV నిఘా ఫుటేజీని కలిగి ఉంటే ప్లెయిన్‌బోరో పోలీసు విభాగానికి కాల్ చేయాలని కోరారు. మేయర్ పీటర్ కాంటు, పబ్లిక్ సేఫ్టీ డైరెక్టర్ చీఫ్ ఎమాన్ బ్లాన్‌చార్డ్ సంయుక్త ప్రకటనలో మాట్లాడుతూ ఈ విషాద సంఘటన పట్ల మనమందరం విచారిస్తున్నామని తెలిపారు. ఈ సమయంలో ప్లెయిన్స్‌బోరో పోలీసు అధికారులు విచారణను పూర్తి చేయడానికి వారి చట్టాన్ని అమలు చేసే భాగస్వాములతో కలిసి పని చేస్తున్నారు. భద్రత గురించి ఇతర వ్యక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్లాన్‌చార్డ్ చెప్పారు.
మృతుల కుటుంబ బంధువులు మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబం మరణంతో తాము షాక్ అయ్యామని, తేజ్ ప్రతాప్ సింగ్, సోనాల్ పరిహార్ సంతోషకరమైన జీవిస్తున్నారనీ, సింగ్ తన కమ్యూనిటీలో కూడా చురుకుగా ఉండేవాడని తెలిపారు. తేజ్ ప్రతాప్ సింగ్ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. అతను నెస్ డిజిటల్ ఇంజనీరింగ్ కోసం లీడ్ APIX ఇంజనీర్‌గా పనిచేశాడు. తేజ్ ప్రతాప్ సింగ్, సోనాల్ పరిహార్ ఇద్దరూ ఐటీ, హెచ్ ఆర్ రంగంలో పనిచేశారని బంధువులు తెలిపారు.