ఇండోనేషియాలో గురువారం నాడు తెల్లవారుజామున భూకంపం చోటు చేసుకొంది. భూకంప కేంద్రం కైమానా వద్ద ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. సముద్రగర్భం కింద 14 కి,మీ. లోతులో భూకంప కేంద్రం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు.
జకార్తా: ఇండోనేషియాలోని తూర్పు ఫ్రావిన్స్ పవువా బరాత్ లో గురువారం నాడు తెల్లవారుజామున 6.1 తీవ్రతతో భూకంపం సంబవించింది. ఈ భూకంపం తర్వాత సునామీ వచ్చే అవకాశం లేదని శాస్త్రవేత్తలు ప్రకటించారు. గురువారం తెల్లవారుజామున భూకంపం సంబవించినట్టుగా అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం కైమానా వద్ద ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. సముద్రగర్భం కింద 14 కి,మీ. లోతులో భూకంప కేంద్రం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు.ప్రాథమిక భూకంప డేటా ఆధారంగా ఇప్పటివరకు భూకంపంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.
ఈ నెల 1వ తేదీన సుమత్రాలో ద్వీపం తీరంలో భూకంపం సంబవించింది. సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.సినాబాంగ్ పట్టణానికి దక్షిణంగా 255 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. ఇండోనేషియాలో తరచుగా భూకంపాలు చోటు చేసుకొంటున్నాయి. ఈ ఏడాది జనవరి మాసంలో సుల ద్వీపంలో 6.2 తీవ్రతతో భూకంపం చోటు చేసుకొంది. భూకంపం కారణంగా 100 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సముద్రతీర ప్రాంతంలోని భవనాలు కుప్పకూలాయి.మూడేళ్ల క్రితం పాలూలో 7.5 తీవ్రతతో సంబవించిన భూకంపం కారణంగా సునామీ కూడా వచ్చింది. దీంతో 4,300 మంది మరణించారు.
పండుగ రోజున వరుస భూకంపాలు.. అసోం, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్‌లలో భూకంపం.. భయంతో వణికిపోయిన ప్రజలు
ఈ ఏడాది అక్టోబర్ 16న ఇండోనేషియాలోని బాలిలో Earth quake చోటు చేసుకొంది.ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.ఏడుగురు గాయపడ్డారు. ఈ ఏడాది అక్టోబర్ 16న ఇండోనేషియాలోని బాలిలో భూకంపం చోటు చేసుకొంది.ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.ఏడుగురు గాయపడ్డారు. Bali ఓడరేవు పట్టణమైన సింగరాజాకు ఈశాన్యంగా 62 కి.మీ దూరంలో 4.8 తీవ్రతతో భూకంపం కేంద్రీకృతమైనందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు.ఈ ఏడాది అక్టోబర్ 16న ఇండోనేషియాలోని బాలిలో భూకంపం చోటు చేసుకొంది.ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.ఏడుగురు గాయపడ్డారు. బాలి ఓడరేవు పట్టణమైన సింగరాజాకు ఈశాన్యంగా 62 కి.మీ దూరంలో 4.8 తీవ్రతతో భూకంపం కేంద్రీకృతమైనందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ భూకంపం కారణంగా కొండ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడి ఇద్దరు మరణించారు. మూడు గ్రామాలకు అధికారులు ప్రవేశాన్ని నిలిపివేశారు.
దీపావళి పండుగ రోజున ఇండియాలో వరుస భూకంపాలు సంభవించాయి. ఈశాన్య రాష్ట్రాలు అసోం, మణిపూర్ సహా హిమాచల్ ప్రదేశ్‌లో ఈ రోజు భూమి కంపించింది. ఈ ప్రకంపనలకు ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ రోజు ఉదయం భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది.ఉత్తరాది రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో గురువారం ఉదయం భూమి రెండు సార్లు కంపించింది.
ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 2.5గా నమోదైంది. మరోసారి ఉదయం 7.15 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 2.4గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ(ఎన్‌సీఎస్) పేర్కొంది. అసోం రాజధాని గువహతి సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. సోనిత్‌పూర్ జిల్లా తేజ్‌పూర్ పట్టణానికి దక్షిణాన 35 కిలోమీటర్ల దగ్గర 25 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు ఎన్‌సీఎస్ వెల్లడించింది. ఇప్పటి వరకైతే ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం సంభవించినట్టు రిపోర్టులు రాలేవు.