భూమి స్థిరంగా ఉంది, సూర్యచంద్రులే తిరుగుతున్నారు: పాకిస్థానీ యువకుడి వ్యాఖ్యలు వైరల్. నెటిజన్ల రియాక్ష్ ఏంటంటే

Published : Aug 28, 2023, 01:45 PM IST
భూమి స్థిరంగా ఉంది, సూర్యచంద్రులే తిరుగుతున్నారు: పాకిస్థానీ యువకుడి వ్యాఖ్యలు వైరల్. నెటిజన్ల రియాక్ష్ ఏంటంటే

సారాంశం

ఓ పాకిస్థాన్ యువకుడు యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆ యువకుడు భూమి స్థిరంగా ఉందని చెబుతున్నాడు. అలాగే సూర్యచంద్రులే భూమి చుట్టూ తిరుగుతున్నారని, అందుకే రాత్రి, పగలు, వాతావరణంలో మార్పులు ఏర్పడుతున్నాయని చెప్పాడు.

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతోందని మనం అందరం స్కూళ్లలోనే నేర్చుకున్నాం. అందరం సౌర వ్యవస్థ, గ్రహాల గురించి చదువుతుకున్నాం. భూమి సూర్యుని చుట్టూ పశ్చిమం నుండి తూర్పుకు ఒక యాంటిలాక్వైజ్ దిశలో తిరుగడం వల్ల, వివిధ అర్ధగోళాలలో పగలు, రాత్రికి ఏర్పడుతుంది. కానీ ఓ పాకిస్థానీ యువకుడు ఇవన్నీ అబద్దమని చెబుతున్నాడు. శాస్త్రీయ వాస్తవాలను సవాలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను ఎక్స్ (ట్విట్టర్)లో  'కృష్ణ' అనే యూజర్ అప్ లోడ్ చేశాడు. నైలా అండ్ షైలా అనే యూట్యూబ్ మీడియా ఛానెల్ తో ఆ యవకుడు మాట్లాడాడు. ఆ యూట్యూబ్ ఛానెల్ లో ఉన్న 27 నిమిషాల వీడియోలో ఈ వీడియో అతడి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

భూమి తన అక్షం మీద తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని విశ్వవ్యాప్తంగా అంగీకరించిన వాస్తవాన్ని అతడు తప్పని చెప్పాడు. భూమి స్థిరంగా ఉందని వీడియోలో అతడు పేర్కొన్నాడు. మరి రాత్రి పగలు ఎలా ఏర్పడుతుందని ఆ యాంకర్ ప్రశ్నించగా.. సూర్యచంద్రులే భూమి చుట్టూ తిరుగుతున్నారని, దీనివల్ల పగలు, రాత్రి, వాతావరణంలో మార్పులు వస్తాయని స్పష్టంగా చెప్పాడు. కాగా.. ఈ ఎంతో నమ్మకంతో అతడు చెబుతున్న ఈ వీడియోను పలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇప్ప టివ ర కు ఈ వీడియోను 5 ల క్ష ల కు పైగా వీక్షించారు.

అయితే ఈ వీడియోలో ఉన్న ఆ పాకిస్థానీ యువకుడి తెలివికి నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ‘‘క్యా బాత్ కర్ రహా భాయ్’’ అంటూ మీమ్స్ పెడుతున్నారు. మరో యూజర్ ‘మారో ముజే మారో’ అని కామెంట్ పెట్టాడు. మరో యూజర్ ‘‘ఈ వీడియోను నా సైన్స్ టీచర్ కు పంపించాను. కానీ ఆయన నుంచి ఇంకా ఎలాంటి రియాక్షన్ రాలేదు. బహుశా ఈ వీడియో చూసి ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. కాగా.. ఇంతకు ముందు పాకిస్తాన్ న్యూస్ యాంకర్లు భారతదేశం విజయవంతమైన 'చంద్రయాన్ -3' మిషన్ను ప్రశంసించిన వీడియో కూడా వైరల్ అయింది. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !