భార్య క్రెడిట్ కార్డుతో.. ప్రియురాలి బిల్లులు.. చివరకు..

Published : Jan 29, 2021, 11:21 AM IST
భార్య క్రెడిట్ కార్డుతో.. ప్రియురాలి బిల్లులు.. చివరకు..

సారాంశం

ఓ వ్యక్తి భార్యకు తెలీకుండా ప్రియురాలిని మొయిన్ టైన్ చేయడం మొదలుపెట్టాడు. ప్రియురాలి మోక్షం కోసం.. ఆమె బిల్లులు అతను చెల్లించడం మొదలుపెట్టాడు. దాని కోసం ఏకంగా భార్య క్రెడిట్ కార్డు వాడాడు. 

భార్యలు.. తమ భర్తలను చాలా ప్రేమగా చూసుకుంటారు. అది ఎప్పటి వరకు అంటే.. వాళ్లు తమను మోసం చేయడం లేదు.. తమతో నిజాయితీ గా ఉన్నంత వరకే. అలా కాదని.. మరో అమ్మాయి వెంట పడుతూ.. తమను మోసం చేయాలని చూశారో.. ఇక అప్పటి వరకు ప్రేమగా చూసుకున్న భార్యలే.. అపరకాళిగా మారి విశ్వరూపం చూపిస్తారు.

తాజాగా.. ఓ వ్యక్తి భార్యకు తెలీకుండా ప్రియురాలిని మొయిన్ టైన్ చేయడం మొదలుపెట్టాడు. ప్రియురాలి మోక్షం కోసం.. ఆమె బిల్లులు అతను చెల్లించడం మొదలుపెట్టాడు. దాని కోసం ఏకంగా భార్య క్రెడిట్ కార్డు వాడాడు. ఇంకేముంది అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన దుబాయిలో చోటుచేసుకుంది.

ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. అటు భార్యకు తన భర్తకు గర్ల్‌ఫ్రెండ్ ఉందనే విషయం గానీ.. ఇటు ప్రేయసికి తన బాయ్‌ఫ్రెండ్‌కు అప్పటికే పెళ్లైందనే విషయం గానీ తెలియకపోవడం. ఇకపోతే తన క్రెడిట్ కార్డు భర్త వద్దే ఉండడంతో అతనే వాడుతున్నట్లు భార్య అనుకుంది. అయితే, కొన్నిరోజులకు కార్డు లావాదేవీలు ఆగిపోవడం.. అప్పటికే భారీగా చెల్లింపులు జరగడంతో అనుమానం వచ్చిన భార్య తన కార్డును ఎవరో హ్యాక్ చేశారని బ్యాంకు వారిని సంప్రదించింది. అప్పుడు అసలు విషయం బయటపడింది.

తన కార్డుపై లావాదేవీలు చేసింది ఓ మహిళ అని తెలుసుకుని, భర్తకు తెలియకుండా సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించిందామె. మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె కార్డుపై లావాదేవీలు జరిపిన నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆ కార్డు తనకు తన ప్రియుడు ఇచ్చాడని సదరు మహిళ పోలీసులకు చెప్పింది. 

దాంతో ఆమె తన భర్త ప్రియురాలని తెలిసి భార్య షాక్ అయింది. ఆ కార్డు నీ ప్రియుడి భార్యదని మహిళకు పోలీసులు చెప్పడంతో.. అప్పటికే తన ప్రియుడికి పెళ్లైన విషయం తెలుసుకుని ప్రియురాలికి నోటమాట రాలేదు. దీంతో అసలు వ్యవహారం బయటకు వచ్చింది. మరి ఇద్దరూ కలిసి అతనిని ఎలా ఆడుకున్నారో మీ ఊహకే వదిలేస్తున్నాం. 

PREV
click me!

Recommended Stories

Gold : టీ తాగిన రేటుకే తులం బంగారం.. ఈ దేశం పేరు తెలిస్తే షాక్ అవుతారు !
Coca Cola Formula : 100 ఏళ్ల కోకా కోలా తయారీ సీక్రేట్ లీక్..? ఏకంగా యూట్యూబ్ లో వీడియో