డ్యాన్సర్‌తో రాసలీలలు: ప్రియుడికే షాకిచ్చిన ప్రియురాలు

By narsimha lodeFirst Published Jun 4, 2019, 3:11 PM IST
Highlights

యూఏఈకి చెందిన ఓ వ్యక్తిని డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్‌ చేసిన మొరాక్ క్లబ్ డాన్సర్‌‌కు దుబాయ్‌ కోర్టు మూడు నెలల శిక్ష విధించింది. జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆమెను దేశం నుండి  బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.

దుబాయ్: యూఏఈకి చెందిన ఓ వ్యక్తిని డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్‌ చేసిన మొరాక్ క్లబ్ డాన్సర్‌‌కు దుబాయ్‌ కోర్టు మూడు నెలల శిక్ష విధించింది. జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆమెను దేశం నుండి  బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.

వివాహితుడైన వ్యక్తికి నైట్‌క్లబ్‌లో మొరాకో డ్యాన్సర్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఈ సమయంలోనే తనకు పెళ్లైంందని... భార్య, పిల్లలు కూడ ఉన్నారని ఆయన బ్యాన్సర్‌కు వివరించారు. క్లబ్‌ల్లో డ్యాన్స్ చేయడం మానేయాలని ఆమెను అతను కోరాడు. అంతేకాదు మద్యం మానేయాలని కూడ సూచించాడు. 

ఈ షరతులకు ఆమె ఒప్పుకొంది. 2018లో ఆ మహిళ మళ్లీ నైట్‌ క్లబ్‌లో డ్యాన్స్ చేస్తూ కన్పించింది.దీంతో ఆమెకు ఆయన బ్రేకప్ చెప్పాడు.  తన మొబైల్  నెంబర్‌ను కూడ మార్చేశాడు. 

అయితే డ్యాన్సర్ మాత్రం అతడిని వదల్లేదు.  తన మాజీ ప్రియుడిని కనిపెట్టే ప్రయత్నం చేసింది. స్నేహితుడి ద్వారా అతడి నెంబర్‌ను తీసుకొంది. తనకు రూ. 1, 03,668 ఇవ్వాలని కోరింది. ఆ తర్వాత  కొంత కాలానికి మరోసారి ఫోన్ చేసి అతడిని బ్లాక్ మెయిల్ చేసింది. ఈ దఫా తనకు రూ. 10,17, 836 ఇవ్వాలని డిమాండ్ చేసింది.

తాను కోరిన డబ్బులు ఇవ్వకపోతే  తమ మధ్య వివాహేతర సంబంధాన్ని కుటుంబసభ్యులకు చెబుతానని బెదిరించింది. అంతేకాదు ఈ మేరకు తామిద్దరం సన్నిహితంగా ఉన్న వీడియోను కూడ ఆమె వాట్సాప్‌లో షేర్ చేసింది.దీంతో బాధితుడు దుబాయ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు మొరాకో డ్యాన్సర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.

తన నేరాన్ని డ్యాన్సర్ ఒప్పుకొంది. దీంతో మూడు మాసాల పాటు జైలు శిక్షను విధించింది కోర్టు. శిక్ష పూర్తైన తర్వాత దేశం నుండి బహిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది.

click me!