కొడుక్కి వచ్చిన ఉత్తరం చదివినందుకు: తండ్రికి రెండేళ్ల జైలు

Siva Kodati |  
Published : Jun 02, 2019, 01:38 PM IST
కొడుక్కి వచ్చిన ఉత్తరం చదివినందుకు: తండ్రికి రెండేళ్ల జైలు

సారాంశం

వేరే వాళ్లకు వచ్చిన ఉత్తరాలు చదవడం సభ్యత అనిపించుకోదు. మన దగ్గర అలా జరిగితే చూసి చూడనట్లు వదిలేయడమో లేదంటే సున్నితంగా మందలించడమో చేస్తాం

వేరే వాళ్లకు వచ్చిన ఉత్తరాలు చదవడం సభ్యత అనిపించుకోదు. మన దగ్గర అలా జరిగితే చూసి చూడనట్లు వదిలేయడమో లేదంటే సున్నితంగా మందలించడమో చేస్తాం. అయితే స్పెయిన్‌లో మాత్రం ఇతరుల ఉత్తరాలు చదవటం శిక్షార్హమైన నేరం. సెవిల్లే ప్రాంతంలో ఓ కుటుంబం నివసిస్తోంది.

ఈ క్రమంలో తన పదేళ్ల కుమారుడికి అతని అమ్మమ్మ లేఖ రాసింది. అందులో ఆ బాలుడి తండ్రిపై గృహ హింస కేసుకు సంబంధించిన వివరాలను ఆరా తీసింది. ఆ తండ్రిని విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసింది.

అయితే తన భార్య తరపువారు తనను మానసికంగా వేధిస్తున్నారని.. తనపై కావాలనే గృహహింస కేసు పెట్టారంటూ కోర్టులో ఆ లేఖను సాక్ష్యంగా సమర్పించాడు ఆ తండ్రి. అయితే ఇక్కడే తేడా కొట్టింది.

అసలు వేరే వారికి వచ్చిన లేఖను ఎలా చదువుతారంటూ న్యాయస్థానం అతనిని ప్రశ్నించింది. ఆ పిల్లాడి గోప్యతకు భంగం కలిగించారంటూ బాలుడి తల్లి తరపు న్యాయవాదులు న్యాయస్థానంలో వాదించారు. వారి వాదనతో ఏకీభవించిన కోర్టు సదరు తండ్రికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. 
 

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే