నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన ట్రంప్

First Published Jun 15, 2018, 11:39 AM IST
Highlights

నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. అణ్వస్త్రాలు, యుద్ధం తదితర విషయాల్లో ప్రపంచానికి ముప్పు తప్పించే అంశంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో ట్రంప్ చర్చలు జరిపారు.. సింగపూర్‌లో ఇరు దేశాధినేతల మధ్య జరిగిన చర్చల సందర్భంగా ఉభయ కొరియా దేశాల మధ్య ఉన్న శత్రుత్వానికి చరమ గీతం పాడేలా కిమ్‌ను ట్రంప్ ఒప్పించారు.. ట్రంప్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కొరియా అధినేత అమెరికా స్పష్టమైన హామీ ఇస్తే.. అణ్వస్త్ర నిరాయుధీకరణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.. ప్రపంచశాంతి విషయంలో ట్రంప్ తీసుకున్న చొరవను గుర్తించిన నార్వేకు చెందని ఇద్దరు ఎంపీలు.. ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించారు. అయితే ఈ ఏడాది నోబెల్ బహుమతికి సంబంధించిన నామినేషన్ గడువు ముగియడంతో వచ్చే ఏడాది ఈ నామినేషన్‌ను పరిశీలించనున్నారు.

click me!