
వాషింగ్టన్: మద్యం మత్తులో ఓ యువతి కారు సైలెన్సర్‌లో తన తల దూర్చింది. అయితే సైలెన్సర్‌లో తల ఇరుక్కొనిపోయి ఆ యువతి తీవ్రంగా ఇబ్బంది పడింది. అయితే చివరకు సైలెన్సర్‌లో ఇరుక్కొన్న ఆ యువతి తలను అతి కష్టం మీద స్థానికులు వెలికి తీశారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకొంది.
అమెరికాకు చెందిన కైట్లిన్ స్ట్రోం అనే యువతి విన్‌స్టక్ మ్యూజిక్ ఫెస్టివల్‌కు వెళ్ళింది. అక్కడ ఫుల్‌గా మద్యాన్ని సేవించింది. అక్కడి నుండి బయటకు వచ్చిన ఆమె పార్క్ చేసిన కారు సైలెన్సర్‌లో తల దూర్చితే ఎలా ఉంటుందని భావించింది. తన తలను సైలెన్సర్‌లో దూర్చింది.
అయితే సైలెన్సర్ నుండి తల బయటకు రాలేదు. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు గ్యాస్ కట్టర్‌ల సహయంతో సైలెన్సర్‌ను కోసి ఆమె తలను బయటకు తీశారు. చిన్న వయస్సులోనే మద్యం చేసినందుకుగాను ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.