నా నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు చేస్తుంది: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

By Sumanth KanukulaFirst Published Aug 9, 2022, 9:54 AM IST
Highlights

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నివాసంలో ఎఫ్‌బీఐ అధికారులు సోదాలు చేపట్టినట్టుగా  తెలస్తోంది. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలోని ట్రంప్ నివాసంపై సోదాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నివాసంలో ఎఫ్‌బీఐ అధికారులు సోదాలు చేపట్టినట్టుగా  తెలస్తోంది. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలోని ట్రంప్ నివాసంపై సోదాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఎఫ్‌బీఐ ఏజెంట్ల పెద్ద సముహం తన ఇంటి వద్ద ఉన్నట్టుగా చెప్పారు. అయితే ఈ చర్య ట్రంప్‌కు, ఆయన మద్దతుదారులకు ఆగ్రహం తెప్పించగా.. ఆయన విమర్శకులకు మాత్రం ఆనందాన్ని కలిగించింది. అయితే ఈ దాడులకు సంబంధించి ఎఫ్‌బీఐ నుంచి అధికారికంగా స్పందన లేదు. వాషింగ్టన్‌లోని FBI ప్రధాన కార్యాలయం, మయామిలోని ఫీల్డ్ ఆఫీస్.. ఈ పరిణామంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి.

‘‘నా అందమైన ఇల్లు... ప్రస్తుతం ముట్టడిలో ఉంది. రైడ్ చేయబడింది. పెద్ద మొత్తంలో FBI ఏజెంట్లచే ఆక్రమించబడింది’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఎఫ్‌బీఐ ఏజెంట్లు తన సేఫ్‌లోకి చొరబడ్డారని చెప్పారు.‘‘అమెరికా అధ్యక్షుడికి ఇంతకు ముందెన్నడూ ఇలాంటిదేమీ జరగలేదు. సంబంధిత ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేసిన తర్వాత, సహకరించిన తర్వాత.. నా ఇంటిపై ఈ అప్రకటిత దాడి సరైనది కాదు. ఇది ప్రాసిక్యూటోరియల్ దుష్ప్రవర్తన.. న్యాయ వ్యవస్థ ఆయుధీకరణ. నేను 2024లో అధ్యక్ష పదవికి పోటీ చేయకూడదనుకునే రాడికల్ లెఫ్ట్ డెమొక్రాట్‌ల దాడి’’ అంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

.ట్రంప్ వైట్ హౌస్ నుంచి ఫ్లోరిడా క్లబ్‌కు తీసుకువచ్చిన పత్రాల పెట్టెలపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తుందని.. దర్యాప్తు గురించి తెలిసిన పేరు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు వ్యక్తులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.

ఇక, ఎఫ్‌బీఐ సోదాల సమయంలో దాడి సమయంలో ట్రంప్ ఎస్టేట్‌లో లేరని.. ఎఫ్‌బీఐ ఎస్టేట్ ఆవరణలోకి ప్రవేశించడానికి సెర్చ్ వారెంట్‌ని వినియోగించిందని రాయిటర్స్ నివేదించింది. ఈ సోదాలు.. రహస్య పత్రాలతో ముడిపడి ఉందని కొన్ని మూలాలను ఉటంకిస్తూ సీఎన్‌ఎన్ తెలిపింది. 

click me!