బ్రేకప్ చెప్పిన గర్ల్‌ఫ్రెండ్‌ను వేడుకుంటూ వర్షంలో 21 గంటలు మోకరిల్లిన యువకుడు

Published : Apr 05, 2023, 12:45 AM IST
బ్రేకప్ చెప్పిన గర్ల్‌ఫ్రెండ్‌ను వేడుకుంటూ వర్షంలో 21 గంటలు మోకరిల్లిన యువకుడు

సారాంశం

చైనాలో ఓ యువకుడు తనకు బ్రేకప్ చెప్పిన గర్ల్‌ఫ్రెండ్ కోసం వర్షంలో తడుస్తూ కఠినమైన చలిలోనూ 21 గంటలు మోకరిల్లి కూర్చున్నాడు. మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఆఫీసు ముందు వేచి చూశాడు. కానీ, ఆమె మన్నించలేదు. ఆయన వేడుకోలను స్వీకరించలేదు.  

న్యూఢిల్లీ: ప్రేమలో ఎంత సంతోషం ఉంటుందో.. బ్రేకప్‌లో అంత విషాదం ఉంటుంది. ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చి బ్రేకప్ చెప్పుకుని మూవ్ అయితే పెద్దగా బాధ ఉండకపోవచ్చు. కానీ, ఒకరికి ఇంకా రిలేషన్‌షిప్ కొనసాగించాలనే బలంగా ఉంటే అది పెడదారులు తీయవచ్చు. కొందరు తీవ్ర నిర్ణయాలు తీసుకుని స్వీయ హాని, లేదా ఎదుటి వారికి హాని తలపెట్టడం చేస్తుంటారు. కొందరు మౌనంగా బాధను దిగమింగుతారు. చైనాకు చెందిన ఓ యువకుడు తన ప్రేమను అంగీకరించి సంబంధాన్ని కొనసాగించాలని గర్ల్‌ఫ్రెండ్‌ను వేడుకుంటూ వర్షంలో 21 గంటలు మోకరిల్లాడు. చేతిలో పూవుల బొకే పట్టుకుని ప్రియురాలు మన్నిస్తుందని ఎదురుచూశాడు. కానీ, ఆమె కనికరించలేదు. ఈ ఘటన సంచలనంగా మారింది. సోషల్ మీడియాలోనూ ఈ ఘటన దుమారం రేపింది.

సౌత్ చైనా మార్నింగ్ పోస్టు కథనం ప్రకారం, ఆ వ్యక్తి 21 గంటలు మోకాళ్లపై కూర్చుని ఎక్స్‌గర్ల్‌ఫ్రెండ్ ఆఫీసు ఎదుట ఎదురుచూశాడు. తనను మళ్లీ అంగీకరించాలని ఆమెను కోరాడు. ఆ వ్యక్తి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది అతను అలా చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు.

దాజౌ ఏరియాలో మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఆఫీసు కాంప్లెక్స్ ఎదుట మోకాళ్ల పై కూర్చున్నాడు. పూలు చేతిలో పట్టుకుని ఆమె కోసం ఎదురుచూశాడు. వర్షం పడుతున్నా.. వెనుదిరగలేదు. కొన్ని రోజుల క్రితమే తన ప్రేయసి ఆయనకు బ్రేకప్ చెప్పింది. కానీ, అతను మాత్రం ఇంకా ప్రేమను కోరుతూనే ఉన్నాడు. తనను మన్నించాలని వేడుకుంటున్నాడు.

Also Read: 'ఇది బీజేపీ కుట్ర': ఆ రాష్ట్రాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై సంజయ్ రౌత్ ఫైర్

మార్చి 28వ తేదీ మధ్యాహ్నం 1 గంటలకు అక్కడ మోకరిల్లితే మరుసటి రోజు ఉదయం 10 గంటలకు విరమించుకున్నాడు. కఠినమైన చలిని తట్టుకోలేక ఆయన విరమించుకున్నట్టు తెలుస్తున్నది.

ఆయన చుట్టూ స్థానికులు గుమిగూడారు. తన ప్రయత్నాన్ని విరమించుకోవాలని, మోకరిల్లాల్సిన అవసరం ఏముందని, ఆమె రాబోవడం లేదని, చాలా మంది ఆయనకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఆయన అంగీకరించలేదు. పోలీసులూ స్పాట్‌కు వచ్చారు. జోక్యం చేసుకునే ప్రయత్నం చేయగా.. ఇలా మోకరిల్లి కూర్చోవడం చట్టవ్యతిరేకమా? ఒక వేళ కాకపోతే తనను ఒంటరిగా వదిలిపెట్టాలని కోరాడు.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !