మెట్రో స్టేషన్ లో మహిళ నిర్వాకం... ఫోన్ చుస్తూ.. పట్టాలపైకి(వీడియో)

Published : Nov 02, 2019, 08:46 AM ISTUpdated : Nov 02, 2019, 08:50 AM IST
మెట్రో స్టేషన్ లో మహిళ నిర్వాకం... ఫోన్ చుస్తూ.. పట్టాలపైకి(వీడియో)

సారాంశం

ఒక్కసారిగా పట్టాల మీద పడిపోయింది. అది చూసిన చుట్టుపక్కలవారు ఒక్కసారిగా షాకయ్యారు. ఈలోపు ప్లాట్‌ఫాం వద్దకు రైలు వచ్చేయడంతో ఆమెకు సాయం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

ప్రస్తుత కాలంలో యువత జనాలతో కంటే.... స్మార్ట్ ఫోన్ లతో మాత్రమే గడిపేస్తున్నారు. ఇంట్లో ఉన్నా... రోడ్డుపై ఉన్నా... ఎక్కడ ఉన్నా... చేతిలోనే స్మార్ట్ ఫోన్. తలపైకి ఎత్తి కనీసం లోకాన్ని కూడా చూడట్లేదు. తాజాగా మెట్రో స్టేషన్ లో ఓ మహిళ  స్మార్ట్ ఫోన్ లో చూస్తూ.. లోకాన్ని మర్చిపోయింది. ఫోన్ లోకంలో పడిపోయి ఆమె చేసిన ఘనత ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన స్పెయిన్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... స్పెయిన్‌లోని మ్యాడ్రిడ్‌లో ఓ మెట్రో స్టేషన్‌లో ఫ్లాట్‌ఫాం వద్దకు వచ్చిన ఓ యువతి.. మొబైల్ ఫోన్ చూడటంలో మునిగిపోయి లోకాన్ని మరిచిపోయింది. ఫ్లాట్‌ఫాం ఎక్కడ ఉంది? రైలు వస్తోందా లేదా? వంటి విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా.. ఫోన్‌లో తలదూర్చి అలా నడుచుకుంటూ పట్టాల వైపు వెళ్లిపోయింది. 

దీంతో ఒక్కసారిగా పట్టాల మీద పడిపోయింది. అది చూసిన చుట్టుపక్కలవారు ఒక్కసారిగా షాకయ్యారు. ఈలోపు ప్లాట్‌ఫాం వద్దకు రైలు వచ్చేయడంతో ఆమెకు సాయం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అయితే పట్టాల మీద పడ్డ మహిళకు ఏమైందీ అనే విషయం మాత్రం వీడియోలో కనిపించలేదు. కాగా..ఈ ఘటనపై మ్యాడ్రిడ్ మెట్రో సంస్థ స్పందించింది. సదరు మహిళ క్షేమంగానే ఉందని ట్వీట్ చేసింది. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. ఇకనైనా కాస్త  ఫోన్ లు వదిలేసి బయటప్రపంచం చూడాలని పలువురు నెటిజన్లు పేర్కొనడం విశేషం. 


 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే