అక్కడ ఆడపిల్లకు జన్మనిస్తే రూ.8లక్షలు గిఫ్ట్

By Nagaraju penumalaFirst Published Nov 1, 2019, 2:14 PM IST
Highlights

 ప్రపంచంలోని దేశాలన్నీ జనాభా నియంత్రణ ఎలా అనే అంశంపై తలలు పట్టుకుంటే ఫిన్లాండ్ ప్రభుత్వం మాత్రం లక్షలాది రూపాయలు బోనస్ ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

ఫిన్లాండ్: ప్రపంచంలోని దేశాలన్నీ జనాభా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ప్రపంచ జనాభా రోజు రోజుకి పెరిగిపోతున్న తరుణంలో ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణకు సంబంధించి అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. 

కానీ ఫిన్లాండ్ మాత్రం అందుకు రివర్స్ అంటుంది. ప్రపంచంలోని అనేక దేశాలు జనాభా నియంత్రణకు పారితోషకాలు ఇస్తుంటే ఫిన్లాండ్ దేశం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. 

ఫిన్లాండ్ లో జనాభా తగ్గిపోయింది. పిల్లలు పుట్టడం కష్టతరంగా మారింది. పశ్చిమ ఫిన్లాండ్  ప్రావిన్సులో ఉన్న అతిచిన్న మున్సిపాలిటీ లెస్టిజార్విలో జనాభా 725 మంది మాత్రమే ఉన్నారంటూ పరిస్తితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఊరిలో 2012లో ఒక్క బేబీ మాత్రమే పుట్టిందట. దాంతో ప్రజలు ఆందోళన చెందారు. పిల్లలు జన్మించకపోవడంతో ఫిన్లాండ్ ప్రభుత్వం 2013లో బేబీ బోనస్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. 

ఈ పథకం కింద ఒక ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ప్రతీ జంటకూ రూ.10వేల యూరోలు పారితోషికాన్ని ప్రారంభించింది. 10వేల యూరోలు అంటే భారతదేశం యెుక్క కరెన్సీలో రూ.7,87,270 ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

ఈ పదివేల యూరోలను కూడా ఏడాదికి 1000 యూరోల చొప్పన పదేళ్లపాటు పదివేల యూరోలు చెల్లిస్తారన్నమాట. ఈ పథకం ప్రారంభించిన తర్వాత ఏడేళ్లలో 60 మంది పిల్లలు పుట్టారట. అంతకు ముందు ఏడేళ్లలో 38 మంది మాత్రమే పుడితే పథకం పుణ్యమా అంటూ 38 మంది కాస్త 60 మందికి పెరిగారు. 

60 మంది ఆడపిల్లలు పుట్టడంతో ఆ ఫిన్లాండ్ లోని ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. పిల్లలు పుట్టకపోతే తమ ఊరు అంతరించే ప్రమాదం ఉండేదని వారంతా అనుకున్నారట. 

ఇప్పటికే వృద్ధుల సంఖ్య భారీగా పెరిగిపోయారు. నడివయస్సులో ఉన్నవారు కేవలం కొద్దిమందే ఉన్నారని వారి తర్వాత జనరేషన్ లేకపోవడంతో వారంతా ఆందోళన చెందారు. అయితే ఒక్కసారిగా 60 మంది ఆడపిల్లలు పుట్టడంతో వారంతా సంబరపడిపోతున్నారట.  

బేబీ బోనస్ పథకం ప్రకారం 60 మంది ఆడపిల్లలకు జన్మనివ్వడంతో మరింత జనాభా పెంచేందుకు 2013లో ప్రవేశపెట్టిన పథకం నిధులు ఇటీవలే ఫిన్లాండ్ ప్రభుత్వం విడుదల చేసిందట. దాంతో అక్కడ జంటల ఆనందాలకు అవధులు లేకుండా పోయిందట.

చైనా అయితే ఒకరే ముద్దు ఇద్దరు వద్దు అన్న నినాదాన్ని అమలు చేస్తోంది. చైనాలో జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేసి విజయవంతం అయ్యింది. 

ఇకపోతే భారత్ జనాభా కూడా విపరీతంగా పెరిగిపోతుండటంతో భారత ప్రభుత్వం సైతం ఇదే నినాదాన్ని అనుసరించే యోచనలో ఉంది. భారత దేశంలో వంశోద్ధారకుడు, వంశం వృద్ధి మోజుతో జనాభా నియంత్రణ కష్టతరంగా మారింది. 

మెుత్తానికి ప్రపంచంలోని దేశాలన్నీ జనాభా నియంత్రణ ఎలా అనే అంశంపై తలలు పట్టుకుంటే ఫిన్లాండ్ ప్రభుత్వం మాత్రం లక్షలాది రూపాయలు బోనస్ ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

click me!