ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం తిరస్కరించిన డిప్యూటీ స్పీకర్: ఎన్నికలకు సిద్దం కావాలని ఇమ్రాన్ పిలుపు

Published : Apr 03, 2022, 01:19 PM ISTUpdated : Apr 03, 2022, 01:47 PM IST
ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం తిరస్కరించిన డిప్యూటీ స్పీకర్: ఎన్నికలకు సిద్దం కావాలని ఇమ్రాన్ పిలుపు

సారాంశం

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట లభించింది. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారు. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం వెనక విదేశీ కుట్రకు ఉందన్నారు. 

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట లభించింది. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్  ఖాసిమ్ సూరి తిరస్కరించారు. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం వెనక విదేశీ కుట్రకు ఉందన్నారు. ఈ కారణంతో డిప్యూటీ స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించలేదు. అయితే అవిశ్వాస తీర్మానం సమయంలో ఇమ్రాన్ ఖాన్ సభకు హాజరుకాలేదు. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడంతో సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో డిప్యూటీ స్పీకర్ సభను వాయిదా వేశారు.  

తనపై అవిశ్వాస తీర్మానం తిరస్కరణకు గురైన అనంతరం ఇమ్రాన్ ఖాన్ జాతినుద్దేశించి ప్రసంగించారు. పాక్‌లో ఎన్నికలు నిర్వహించాలని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి‌ని కోరారు. ఎన్నికలకు సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తనపై కుట్ర జరిగిందన్నారు. తనపై అవిశ్వాస తీర్మానం.. పాకిస్తాన్‌పై జరిగిన విదేశీ కుట్ర అని ఆయన చెప్పుకొచ్చారు. దేశ ప్రజలను ఇమ్రాన్ అభినందించారు.

‘‘అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షునికి లేఖ రాశాను. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి. ఎన్నికలకు సిద్ధం కావాలని పాకిస్థాన్‌కు నేను ప్రజలకు పిలుపునిస్తున్నాను’ అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. 

2018లో ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలసిందే. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీకి 155 మంది సభ్యుల బలం ఉండగా.. ఇతర పార్టీల మద్దతుతో ఆయన సంకీర్ణ ప్రభుత్వం కొనసాగిస్తున్నారు. మొత్తం 342 మంది సభ్యులున్న పాక్ జాతీయ అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి 172 మంది సభ్యుల మద్దతు అవసరం. 

అయితే ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపిస్తూ విపక్షాలు ఆయనపై అవిశ్వాస తీర్మానం ఇచ్చాయి. సొంతపార్టీలోని 12 మంది, మిత్రపక్షం ఎక్యూఎంకు చెందిన ఏడుగురు విపక్షాలకు మద్దతు ఇవ్వడం ఇమ్రాన్ కు ఇబ్బందికరంగా మారింది. పాక్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంపై మార్చి 31న చర్చ జరగాల్సి ఉండగా.. అది నేటికి వాయిదా పడింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే