Russia Ukraine War: అది త‌ప్పిద‌మే.. నాటో స‌భ్య‌త్వంపై మాట మార్చిన‌ ఉక్రెయిన్‌

Published : Apr 03, 2022, 06:00 AM IST
Russia Ukraine War: అది త‌ప్పిద‌మే.. నాటో స‌భ్య‌త్వంపై మాట మార్చిన‌ ఉక్రెయిన్‌

సారాంశం

Russia Ukraine War: ర‌ష్యా- ఉక్రెయిన్ ల మ‌ధ్య శాంతి చ‌ర్య‌లు సానూకూల ఫ‌లితాల‌ను ఇవ్వ‌డంతో రష్యా సేనలు వెనక్కు తగ్గుతున్నాయి. మరోవైపు మ‌రో దశ చర్చలు కొనసాగుతున్నాయి. ఇంతలో రష్యా ఆగ్రహానికి కారణమైన ‘నాటో సభ్యత్వం’ అంశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ ను నాటో కూట‌మిలో చేర్చుకోక‌పోవ‌డం త‌ప్పిద‌మేన‌ని ఆరోపించారు.  

Russia Ukraine War:  ఉక్రెయిన్-రష్యా మధ్య జ‌రుగుతోన్న యుద్దం ముగిసిపోబోతుంది. శాంతి చ‌ర్య‌లు సానూకూల ఫ‌లితాల‌ను ఇవ్వ‌డంతో రష్యా సేనలు వెనక్కు తగ్గుతున్నాయి. మరోవైపు దశలవారీగా చర్చలు కొనసాగుతున్నాయి.   ఇంతలో విధ్వంసానికి మూల కారణాల్లో ఒకటైన ‘‘నాటో కూటమిలో చేరిక’’పై ఉక్రెయిన్‌ మాట మార్చింది.  రష్యా ఆగ్రహానికి కారణమైన ‘నాటో సభ్యత్వం’ అంశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలుత నాటో సభ్యత్వం కోసం అభ్యర్థించిన ఆయన.. యుద్దం తీవ్రత పెరుగుతున్న కొద్దీ.. తాము ఆ కూటమిలో చేరబోమని,  తటస్థంగా ఉంటామని తేల్చిచెప్పారు. కానీ.. తాజాగా మ‌రో సారి  ‘‘నాటో కూటమిలో చేరిక’’పై ఉక్రెయిన్ అధ్యక్షుడు  మాట మార్చారు. తాజాగా తమకు సభ్యత్వం ఇవ్వకపోవడం నాటో చేసిన తప్పిదమని విమర్శించింది.

తాజాగా..  ఫాక్స్‌ న్యూస్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌ను నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో చేరనివ్వకపోవడం పొరపాటు అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్ బలహీన దేశం కాదని.. పూర్తిస్థాయి సభ్యులమైతే నాటో నాటోను మరింత బలపరుస్తామని తెలిపారు. ‘‘ మేం బలపడేందుకు.. నాటోను బలిపెట్టమనడం లేదు. మేం నాటో చేరితే.. మరింత ప్రయోజనకారంగా ఉంటుంది. యూరప్‌ ఖండంలో  ఉక్రెయిన్ కూడా ముఖ్యమైన దేశం’’ అని జెలెన్‌ స్కీ అన్నారు. కాగా.. పుతిన్ ను ఆపకపోతే.. వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ దాటి ఐరోపాలో తన దూకుడును కొనసాగిస్తాడని జెలెన్స్కీ హెచ్చ‌రించారు. 

                ర‌ష్యా ఆయుధ డిపో మీద ఉక్రెయిన్ దాడి చేసింద‌నే ఆరోప‌ణ‌ల‌పై జెలెన్స్కీ స్పందించారు. ఈ దాడులు ఉక్రెయిన్‌ పనేనని రష్యా పేర్కొనగా.. తమకేమీ తెలియదని ఉక్రెయిన్‌ జవాబిచ్చింది. పైగా రష్యా నే తన క్షిపణులతో తన డిపోలను పేల్చేసుకుందని జెలెన్‌ స్కీ అన్నారు. ఈ క్ర‌మంలో ర‌ష్యాపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇళ్లు, వీధుల్లో ర‌ష్యా బ‌లాగాలు మందుపాతరలు పెడుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని జెలెన్‌ స్కీ ప్రజలను హెచ్చరించారు. 

కాగా, కీవ్‌ శివారు బుచా పట్టణంలో శనివారం ఒకే వీధిలో 20 మంది పైగా పౌరుల మృతదేహాలు కనిపించాయి. ఇక్కడ 300 మందిని సామూహిక ఖననం చేసినట్లు స్థానిక నేతలు తెలిపారు. పోపాస్నా, రూబిజ్నే నగరాలను స్వాధీనం చేసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. మైకోలైవ్‌లో రష్యన్‌ దళాల దాడుల్లో మృతుల సంఖ్య 33కి పెరిగింది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : కుండపోత వర్ష బీభత్సం... అక్కడ అల్లకల్లోలం
Most Dangerous Lake : ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సరస్సు.. దిగితే ప్రాణాలు పోవడం ఖాయం!