అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: చరిత్ర సృష్టించిన రిచీ టోరెన్

By narsimha lodeFirst Published Nov 5, 2020, 2:25 PM IST
Highlights

అమెరికా ఎన్నికల్లో డెమోక్రటిక్  పార్టీ అభ్యర్ధి రిచీ టోరెన్ రికార్డు సృష్టించాడు.  యూఎస్ కాంగ్రెస్ కు ఎన్నికైన తొలి నల్ల జాతికి చెందిన స్వలింగ సంపర్కుడిగా(గే) ఆయన రికార్డు సృష్టించాడు.


వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో డెమోక్రటిక్  పార్టీ అభ్యర్ధి రిచీ టోరెన్ రికార్డు సృష్టించాడు.  యూఎస్ కాంగ్రెస్ కు ఎన్నికైన తొలి నల్ల జాతికి చెందిన స్వలింగ సంపర్కుడిగా(గే) ఆయన రికార్డు సృష్టించాడు.

also read:అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: అగ్ర రాజ్యంలో నిరసనలు, భయంలో ప్రజలు

న్యూయార్క్ సిటీ కౌన్సిల్ సభ్యుడిగా ఆయన పనిచేస్తున్నాడు. న్యూయార్క్ రాష్ట్రంలోని 15వ కాంగ్రెషనల్ జిల్లా నుండి ఆయన పార్లమెంట్ కు ఎన్నికయ్యారు.

తన సమీప ప్రత్యర్ధి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి పాట్రిక్ డెలిసెస్ పై ఆయన విజయం సాధించాడు.అమెరికా పార్లమెంట్ కు ఎన్నిక కావడంపై  టోరెన్ హర్షం వ్యక్తం చేశాడు. ఇవాళ్టి నుండి కొత్త శకం ప్రారంభమైందని చెప్పారు.

2013 నుండి సిటీ కౌన్సిల్ సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నాడు. అలా మాండెయిర్ జోన్స్ అనే మరో నల్లజాతికి చెందిన గే వెస్ట్ చెస్టర్ కౌంటీ నుండి పోటీ చేశాడు. ఈ ఫలితం ఇంకా వెల్లడించాల్సి ఉంది. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. విజయానికి ఆరు ఓట్ల దూరంలో బైడెన్ ఉన్నాడు. విజయంపై బైడెన్, ట్రంప్ లు ధీమాగా ఉన్నారు. మరో వైపు ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్లు వేశారని... ఇది చేయకూడదని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

click me!