నేపాల్‌లో కుప్పకూలిన విమానం

Published : Jul 24, 2024, 11:58 AM ISTUpdated : Jul 24, 2024, 12:22 PM IST
నేపాల్‌లో కుప్పకూలిన విమానం

సారాంశం

నేపాల్‌లోని ఖాట్మండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యే క్రమంలో ఎయిర్‌క్రూతో సహా 19 మంది ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది.

నేపాల్‌లోని ఖాట్మండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యే ప్రయత్నంలో ఎయిర్‌క్రూతో సహా 19 మంది ప్రయాణిస్తున్న విమానం బుధవారం కుప్పకూలింది. శౌర్య ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న ఈ విమానం రిసార్ట్ టౌన్ పోఖారాకు వెళ్తుండగా ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కాగా, రన్‌వే నుంచి విమానం జారిపడిందని విమానాశ్రయ ప్రతినిధి ప్రేమ్‌నాథ్ ఠాకూర్ తెలిపారు.

 

 

ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కెప్టెన్ ఎంఆర్ షాక్యాను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విమానాశ్రయంలో దట్టమైన పొగలు కనిపిస్తున్నాయి. రెస్క్యూ. రికవరీ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.

రన్‌వే నుంచి విమానం జారిపోవడానికి కచ్చితమైన కారణం తెలియరాలేదు. ప్రాణనష్టంపైనా ఇప్పటివరకు పూర్తి స్పష్టత రాలేదని స్థానిక మీడియా పేర్కొంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో సహా అత్యవసర సిబ్బంది పరిస్థితిని నిర్వహించడానికి, ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టడానికి పని చేస్తున్నందున త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు.

 

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే