భార్యకు కరోనా: క్వారంటైన్‌కి దావూద్ ఇబ్రహీం

Published : Jun 05, 2020, 04:49 PM ISTUpdated : Jun 05, 2020, 04:58 PM IST
భార్యకు కరోనా: క్వారంటైన్‌కి దావూద్ ఇబ్రహీం

సారాంశం

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భార్యకు కరోనా సోకిందని పాక్ మీడియా ప్రకటించింది.  

న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భార్యకు కరోనా సోకిందని పాక్ మీడియా ప్రకటించింది.

దావూద్ ఇబ్రహీం పర్సనల్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్స్ ను క్వారంటైన్ కు తరలించారని మీడియా తెలిపింది.ముంబైలోని డోంగ్రీలో దావూద్ ఇబ్రహీం కస్కర్ జన్మించారు.ముంబై నుండి దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోని కరాచీలో ఉన్నట్టుగా నమ్ముతారు. ఇండియా కోరుతున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదల్లో దావూద్ ఇబ్రహీం ఒకరు.

1993లో ముంబై బాంబు పేలుళ్ల ఘటనలో దావూద్ ఇబ్రహీంపై ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అతనిని అరెస్ట్ చేసేందుకు ఇంటర్ పోల్ నోటీసులు కూడ జారీ చేసింది.
దావూద్ ఇబ్రహీం ప్రస్తుం కరాచీలోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా  రిపోర్ట్స్ చెబుతున్నాయి. దావూద్ ఇబ్రహీం సతీమణి మెహజబీన్ కూడ కరోనా సోకడంతో ఆమెకు చికిత్స అందిస్తున్నారని తెలిసింది.

దావూద్ ను 2003లో గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది అమెరికా. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దావూద్ పై ఇండియా 25 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది.


 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !