ఈ మంత్రంతో కరోనా పరారేనన్న దలైలామా, సోషల్ మీడియాలో వైరల్

By Siva KodatiFirst Published Jan 29, 2020, 3:05 PM IST
Highlights

చైనాలో పుట్టి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను తాను చిన్న మంత్రం సాయంతో పొగొట్టగలనని అంటున్నారు బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా

చైనాలో పుట్టి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను తాను చిన్న మంత్రం సాయంతో పొగొట్టగలనని అంటున్నారు బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా. వుహాన్ నగరంలో కరోనా వైరస్ వల్ల చైనాలో ఇప్పటి వరకు 130 మంది చనిపోగా వేలాదిమందిలో ఈ లక్షణాలు కనిపించాయి.

Also Read:కరోనా కలకలం... కుటుంబాన్ని వైరస్ నుంచి కాపాడిన పెంపుడు కుక్క

దీంతో చైనాలోని అనేక మంది బౌద్ధులు కరోనా బారి నుంచి తమను రక్షించాల్సిందిగా ఫేస్‌బుక్ వేదికగా దలైలామాను కోరారు. దీనిని స్పందించిన ఆయన మంత్రాలు పఠించాలని సూచించారు.

ముఖ్యంగా ‘‘తారా మంత్రం’’ కరోనా వైరస్ నుంచి రక్షిస్తుందని పెద్దాయని తెలిపారు. ‘‘ ఓం తారే తుత్తారే సోహా’’ అనే మంత్రం పఠిస్తున్న ఆడియో క్లిప్‌ను కూడా తన పోస్ట్‌కు దలైలామా జతచేశారు.

ఈ మంత్రం జపించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని, తద్వారా ఎలాంటి బాధలు ఉండవని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ మంత్రం చైనాలో వైరల్ అవుతోంది. కాగా గత 24 గంటల్లో 1,300 కరోనా కేసులు నమోదయ్యాయి. దగ్గు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు.

మరోవైపు కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌తో సమావేశమయ్యారు. కరోనా వైరస్ ఒక పిశాచి లాంటిదన్న ఆయన.. అది ఎక్కడ దాక్కున్నా తాము వదిలిపెట్టమన్నారు. కరోనా వైరస్ సోకిన వుహాన్ నగరంలో వున్న వివిధ దేశాల ప్రజలను తరలించమని డబ్ల్యూహెచ్‌వో సూచించలేదన్నారు.

కేరళ నర్స్ కి కరోనా వైరస్.... సౌదీకి కూడా పాకేసింది..

ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం అతిగా స్పందించకుండా ప్రశాంతంగా ఉంటే బాగుంటుందని జిన్‌పింగ్ సూచించారు. ఇప్పటి వరకు థాయ్‌లాండ్, జపాన్, దక్షిణకొరియా, వియత్నాం, సింగపూర్, మలేషియా, నేపాల్, శ్రీలంక, ఆస్ట్రేలియా దేశాల్లో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 

click me!