కరేబియన్ దీవుల్లో భూకంపం: సునామీ హెచ్చరికలు

By narsimha lodeFirst Published Jan 29, 2020, 7:46 AM IST
Highlights

కరేబియన్ దీవుల్లో బుధవారం నాడు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. 


క్యూబా: కరేబియన్ దీవుల్లో బుధవారం నాడు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. జమైకా, క్యూబా, కేమన్ దీవుల మధ్య సముద్రంలో భూకంపం సంభవించింది.

జమైకా, క్యూబా, కేమన్ దీవుల మధ్య సముద్రంలో 10 కి.మీ దూరంలో భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.7గా నమోదైంది.దీంతో యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే, అంతర్జాతీయ సునామీ కేంద్రం క్యూబా, జమైకా, కేమన్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు .

ఈ భూకంపంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. భూకంపం కారణంగా ఏ మేరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎంత ఉందో ఇంకా తేలాల్సి ఉంది.  భూకంపం మాంటెగో బే- జమైకాకు వాయువ్యంగా 140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమయ్యింది. ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించింది.

ఈ భారీ భూకంపం నేపధ్యంలో క్యూబా, జమైకా తీరప్రాంతాల్లో అత్యంత ప్రమాదకరమైన సునామీ వచ్చే అవకాశాలున్నాయని యుఎస్ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 

భూకంపం వచ్చిన వెంటనే జనం ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపానికి సంబంధించిన వీడియోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. క్యూబాలో భూకంపం వచ్చిన కొద్దిసేపటికే కేమన్ దీవుల్లో కూడా భూకంపం వచ్చింది. ఇక్కడ భూకంప తీవ్రత 6.1గా నమోదయ్యింది.


 

click me!