పాకిస్తాన్‌లో హిందూ వధువు కిడ్నాప్: మతం మార్చుకొందని సోషల్ మీడియాలో పోస్టు

By narsimha lodeFirst Published Jan 29, 2020, 1:21 PM IST
Highlights

పాకిస్తాన్ లో హిందూ వధువు కిడ్నాప్ కు గురైంది. అయితే ఆమె అప్పటికే మతం మార్చుకొందని సోసల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారాయి. 

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌‌లోని సింథ్ ప్రావిన్స్‌లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెళ్లి మండపం నుండి 24 ఏళ్ల యువతిని  కిడ్నాప్ చేశారు. ఆమెను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి మరో యువకుడితో పెళ్లి చేశారు.

పాకిస్తాన్ సింథ్ రాష్ట్రంలోని హలా పట్టణంలో ఈ ఘటన  చోటు చేసుకొంది. ఈ ఘటనపై స్థానికంగా కలకలం రేపింది. వచ్చాయి.ఈ విషయమై సింథ్ రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి నివేదిక కోరారు. 

మరో వైపు ఆ యువతి అంతకు ముందే ఇస్లాం మతం స్వీకరించిందని సామాజిక మీడియాలో కొన్ని పత్రాలను వైరల్‌గా మారాయి. ఈ విషయమై ఢిల్లీలోని పాక్ హై కమిషన్ కార్యాలయ సీనియర్ ఉద్యోగిని పిలిపించి భారత్ తన నిరసనను వ్యక్తం చేసింది.  

హలా పట్టణంలో యువతి హిందూ యువకుడిని పెళ్లి చేసుకొనేందుకు పెళ్లి మండపంలో ఉన్న సమయంలో   సాయుధులైన   కొందరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు. 

యువతి తండ్రి కిషోర్ దాస్ ఈ విషయమై స్థానిక అధికారులకు జరిగిన ఘటనను వివరించారు. తన కూతురు వివాహ వేడుక జరుగుతున్న సమయంలో  షారుఖ్ గుల్ అనే వ్యక్తి కొందరు సాయుధులతో వచ్చి తన కూతురును కిడ్నాప్ చేశారని ఆయన చెప్పారు.

మరో వైపు 2019 డిసెంబర్ 1వ తేదీ ఆ యువతి ఇస్లాం మతం స్వీకరించినట్టుగా  సోషల్ మీడియాలో కొన్ని పత్రాలు వైరల్‌గా మారాయి.  ఇస్లాం మతం స్వీకరించిన తర్వాత ఆ యువతి పేరు  బుషురా గా మారిందని జమియత్ ఉల్ ఉలుం  ఇస్లామియా  ప్రకటించింది.  కరాచీలో ఉన్న ఈ సంస్థ ప్రతినిధి అల్లామా మహ్మద్ యూసుఫ్ భానురి ప్రకటించారు.

ఈ మేరకు యూసుఫ్ భానురి సర్టిఫికెట్ జారీ చేసే సమయంలో   ముఫ్తీ అబుబకర్ సయిద్  ఉర్ రెహమాన్ సాక్షిగా ఉన్నాడని  భానురి ప్రకటించారు. ఆ యువతి స్వంత పట్టణం   హలా గా  ఆమె సర్టిఫికెట్లలో ఉంది. కరాచీ పట్టణంలోని గుల్లాన్ ఏరియాను తాత్కాలిక చిరునామాగా ఉంది. 
 

click me!