
న్యూజిలాండ్ : గాబ్రియెల్ తుఫాను ఉత్తర న్యూజిలాండ్ అంతటా విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ తుఫాను కారణంగా బుధవారం ముగ్గురు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. తుపాను కారణంగా రాత్రిపూట వరదలు పెరిగాయి. దీంతో హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టారు. వరదల నుంచి తప్పించుకోవడాని ఇంటి పైకప్పుల మీదికి ఎక్కిన వందలాది మందిని కాపాడారు.
తుఫాను సమయంలో వాలంటీర్ అగ్నిమాపక సిబ్బంది ఒకరు తప్పిపోయారు. ఈ ప్రదేశానికి సమీపంలో ఒక మృతదేహం కనుగొన్నారు. తూర్పు తీరంలోని హాక్స్ బే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో మరొక మహిళ ఇల్లు కూలిపోయి మరణించింది.
హాక్స్ బేలో మూడవ మృతదేహం దొరికింది. అయితే, దీనికి సంబంధించిన వివరాలు అస్పష్టంగానే ఉన్నాయని అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ మినిస్టర్ కీరన్ మెక్‌అనుల్టీ మాట్లాడుతూ, హాక్స్ బేలో విశాలమైన వ్యవసాయ భూములు, ఎత్తైన పర్వతాలు, చేరుకోవడానికి కష్టంగా ఉండే పట్టణాల పరిస్థితి గురించి ప్రభుత్వం ఆందోళన చెందుతోందని అన్నారు.
మిచిగాన్ యూనివర్శిటీ కాల్పులు : కాల్చుకుని చనిపోయిన నిందితుడు.. జేబులో దొరికిన నోట్ లో ఏముందంటే..
"మాకు తెలిసినంత వరకు కొన్ని ప్రాంతాలకు రెండు రోజులుగా కమ్యూనికేషన్లు లేవు. ఆహారం, నీటి కొరత ఉందని తెలుసు" అని ఆయన చెప్పారు. వరదనీటితో రోడ్లు కొట్టుకుపోయి కమ్యూనికేషన్‌లు తెగిపోయాయి. ఈ పట్టణాల్లో పూర్తి స్థాయిలో నష్టాన్ని అధికారులు ఇప్పుడు అంచనా వేయడం ప్రారంభించారు. దాదాపు 10,500 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని మెక్‌అనుల్టీ చెప్పారు.
దేశంలోని ఉత్తర ప్రాంతంలో విద్యుత్తు నెమ్మదిగా పునరుద్ధరించబడుతుందనీ.. అయినప్పటికీ, 140,000 మందికి పైగా ప్రజలు ఇంకా కరెంట్ లేకుండానే ఉన్నారని మెక్ చెప్పారు. హాక్స్ బేలో "దాదాపు 300 మందిని ఇంటి పైకప్పుల మీదినుంచి కాపాడినందుకు" రెస్క్యూ వర్కర్లు, సైనిక సిబ్బందిని ప్రశంసించాడు. వరద నీటిలో చిక్కుకున్న ఒక పెద్ద భవనం నుండి 60 మంది వ్యక్తుల బృందాన్ని రక్షించినట్లు ఆయన చెప్పారు.
దెబ్బతిన్న రోడ్లు, ఇండ్లు, వంతెనలను బాగు చేయడం సుదీర్ఘ ప్రయాణం ..ఇది ఒక ముఖ్యమైన విపత్తు, ప్రభావిత ప్రాంతాలు కోలుకోవడానికి చాలా వారాలు పడుతుంది. దేశ చరిత్రలో మూడోసారి మాత్రమే జాతీయ అత్యవసర పరిస్థితిని మంగళవారం అధికారులు ప్రకటించారు. న్యూజిలాండ్ లోని ఐదు మిలియన్ల మంది నివాసితులలో మూడొంతుల మంది తుఫాను తీవ్రత ఎక్కువ ఉన్న నార్త్ ఐలాండ్‌లో ఉన్నారు.
గాబ్రియెల్ తుఫాను దక్షిణ పసిఫిక్ మీదుగా బారెల్ చేయడానికి ముందు ఫిబ్రవరి 8న ఆస్ట్రేలియా ఈశాన్య తీరంలో కోరల్ సముద్రంలో ఏర్పడింది. ఆదివారంనాడు న్యూజిలాండ్ ఉత్తర తీరంలో గంటకు 140 కిలోమీటర్ల (87 మైళ్లు) వేగంతో గాలులు వీచాయి. తరువాతి 24 గంటల్లో, తీరప్రాంత ప్రాంతాలు 20 సెంటీమీటర్ల (దాదాపు ఎనిమిది అంగుళాలు) వర్షంతో ముంచెత్తాయి. 11-మీటర్ల (36-అడుగుల) అలలు ఏర్పడ్డాయి.