
ఆఫ్రికా : ప్రకృతి వైపరీత్యాలు ప్రజల ప్రాణాల్ని పెద్ద ఎత్తున హరిస్తున్నాయి. టర్కీ భూకంప విషాదం మరువకముందే.. ఆఫ్రికాలో తుపాను బీభత్సం సృష్టించింది. దాదాపు వందమందికి పైగా ప్రజల ప్రాణాలు బలితీసుకుంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా మరణాల సంఖ్య మరింత పెరగొచ్చని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. ఆఫ్రికాలో ‘ఫ్రెడ్డీ’ తుఫాను బీభత్సం సృష్టించింది. మలావి దేశంలో ఈ తుఫాను దాటికి 100 మందికి పైగా మృతి చెందారు. ఈ ప్రకృతి వైపరీత్యంలో మృతి చెందినవారిలో 60 మృతదేహాలను ఇప్పటికే గుర్తించారు. ఆఫ్రికాలో ఫ్రెడ్డీ తుఫాను నెల రోజుల వ్యవధిలో.. ఇలాంటి భయంకరమైన పరిస్థితిని కలిగించడం ఇది రెండోసారి.
ఈ ఫ్రెడ్డీ తుఫాను దాటికి అక్కడ నదులు పొంగిపొర్లుతుండడంతో ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. ఈ నీటి ప్రవాహంలో ప్రజలు నిస్సహాయంగా కొట్టుకుపోతున్నారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం అల్లాడిపోతున్నారు. ప్రవాహ ధాటికి ఎక్కడికక్కడ భవనాలు కూలిపోతున్నాయి. దీంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. తుఫాను దాటికి దక్షిణ మధ్య ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఇప్పటికి వర్షంతో కూడిన గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. దీంతో దక్షిణ మధ్య ఆఫ్రికాలో సహాయక చర్యలు చేపడుతున్న ఎమర్జెన్సీ బృందాలకు ఇవి తీవ్ర ఇబ్బందిగా మారాయి.
వాయు కాలుష్యం ఎఫెక్ట్: ఒక్కవారంలోనే 2 లక్షల మంది ఆస్పత్రిపాలు.. ఆందోళనలో సర్కారు..
మరోవైపు, ఆఫ్రికాలో ఎక్కువగా ఇళ్లన్నీ మట్టినిర్మాణాలే ఉండడం వల్ల.. ఈ తుఫాను దాటికి అవి ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ప్రజలు ఎక్కువగా ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది అని స్థానిక పోలీసులు తెలిపారు. మలావిలో ఈ తుఫాను బీభత్సం సృష్టించడంతో పరిస్థితులు భయానకంగా మారిపోయాయి. ఏటు చూసినా కూలిపోయిన చెట్లు.. విరిగిపడిన కొండ చరియలు దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
మాలావిలోని బ్లాంటైర్ ఆసుపత్రికి తరలించి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో.. ప్రాణాలు కోల్పోతున్న వారు, క్షతగాత్రుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది. ఈ మేరకు మలావి విపత్తు నిర్వహణ శాఖ ప్రతినిధి చిపిలిరో ఖములా తెలిపారు. తుఫాను ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో నదులు ప్రవాహం ఉదృతంగా ఉంది. దీనివల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.