సెల్‌ఫోన్ పేలి సీఈవో మృతి.. పేలిన ఫోన్ ఏంటంటే..

Published : Jun 21, 2018, 05:38 PM IST
సెల్‌ఫోన్ పేలి సీఈవో మృతి.. పేలిన ఫోన్ ఏంటంటే..

సారాంశం

సెల్‌ఫోన్ పేలి సీఈవో మృతి.. పేలిన ఫోన్ ఏంటంటే.. 

ఈ మధ్యకాలంలో సెల్‌ఫోన్ పేలి మరణిస్తున్న వారి సంఖ్య బాగా ఎక్కువైంది.. తాజాగా ఓ కంపెనీ సీఈవో ఇదే తరహాలో దుర్మరణం పాలయ్యారు.. వివరాల్లోకి వెళితే.. మలేషియాలోని క్రాడిల్ ఫండ్ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్న నజ్రీన్ హసన్ ఇంటి వద్ద తన ఫోనును ఛార్జింగ్ పెట్టాడు. అది ఆకస్మాత్తుగా పేలిపోయింది. పేలుడు ధాటికి సెల్‌ఫోన్‌లోని భాగాలు ఆయన మెడ, తల భాగంలోకి గట్టిగా చొచ్చుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావమై నజ్రీన్ అక్కడికక్కడే దుర్మరణం పాలయయ్యారు.

ఫోన్ పేలిన తర్వాత అగ్నిప్రమాదం సంభవించడంతో చెలరేగిన పొగ వల్ల ఊపిరాడక ఆయన మరణించారని తొలుత భావించారు.. అయితే పోస్ట్‌మార్టం నివేదికలో అసలు విషయం తెలిసిందే.. నజ్రీన్ హసన్ 15 సంవత్సరాలుగా క్రాడిల్ ఫండ్ సంస్థకు సీఈవోగా సేవలందిస్తున్నారు.. ఈయనకు భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు... కాగా, ఆయన వద్ద  బ్లాక్ బెర్రీ, హువాయ్ కంపెనీలకు చెందిన రెండు స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి..  ఉదయం రెండింటికి ఛార్జింగ్ పెట్టాడు.. అయితే వాటిలో పేలింది ఏంటన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి