బిడ్డకు జన్మనిచ్చిన ప్రధాని

First Published Jun 21, 2018, 2:56 PM IST
Highlights

బిడ్డకు జన్మనిచ్చిన ప్రధాని

న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ బిడ్డకు జన్మనిచ్చారు. ఆక్లాండ్‌లోని ఆస్పత్రిలో ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు.. దేశ ప్రధానులు అయ్యారంటే కచ్చితంగా వారి వయసు 60లలో ఉంటుందని మీరు అనుకోవచ్చు. అయితే న్యూజిలాండ్‌కు మాత్రం యంగ్ ఎండ్ ఎనర్జీటిక్ ఉమెన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. 37 ఏళ్ల జెసిండా గతేడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు..

జనవరిలో తాను గర్భంతో ఉన్నట్లు ప్రజలకు తెలిపారు. నెలలు నిండటంతో ఆస్పత్రిలో ఉండే పాలనా వ్యవహారాలను పర్యవేక్షించారు. బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం పాప, భర్తలతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. తల్లిదండ్రులైన వారు ఏ విధంగా ఉద్విగ్న క్షణాలను గడుపుతారో.. ప్రస్తుతం మేం కూడా అలాంటి స్థితిలోనే ఉన్నామంటూ ట్వీట్ చేశారు. దీంతో న్యూజిలాండ్ వాసులు తమ దేశ ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు... కాగా దేశాధినేతగా ఉండి బిడ్డకు జన్మనిచ్చిన వారిలో జెసిండా రెండో వ్యక్తి.. 1990లో పాకిస్థాన్ ప్రధానిగా ఉన్న బెనజీర్ భుట్టో బిడ్డకు జన్మనిచ్చారు.  

click me!