ఇడా తుఫాను: వరదల దాటికి చెట్టుపై చిక్కుకున్న ఆవు.. రక్షించేందుకు రెస్క్యూ టీమ్, వీడియో వైరల్

By Siva KodatiFirst Published Sep 2, 2021, 4:52 PM IST
Highlights

అమెరికాలో ఇడా హరికేన్ విధ్వంసం సృష్టిస్తోంది. రికార్డు బ్రేక్ చేస్తూ కురిసినవానలకు న్యూయార్క్ సహా న్యూజెర్సీ రాష్ట్రమూ అతలాకుతలమైంది. వెంటనే న్యూయార్క్ సిటీ మేయర్ ఎమర్జెన్సీ విధించారు. ఈ సందర్భంలో రెస్క్యూ టీం ఆవును రక్షించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 

ఇడా హరికేన్ అమెరికాలో ఎంతటి విధ్వంసం సృష్టించిందో అందరికి తెలిసిందే. తుపాను నెమ్మదించిన తరువాత రెస్క్యూ టీమ్ ప్రజలను రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంలో రెస్క్యూ టీం ఆవును రక్షించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తుఫాను  కారణంగా వరద నీరు ముంచెత్తడంతో ఆ నీటితో కొట్టుకుపోయిన ఆవు ఒకటి చెట్టుపై చిక్కుకుంది. దీనిని గమనించి ఇద్దరు వ్యక్తులు దానిని సురక్షితంగా కిందకు దించి ప్రాణాలు కాపాడారు. ‘న్యూ ఓర్లీన్స్ ‌లో ఘటన జరిగింది. కాగా, అమెరికా గల్ఫ్ తీరాన్ని తాకిన అత్యంత శక్తివంతమైన తుఫానులలో ఇడా హరికేన్ ఒకటి. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న చిత్రాలు, వీడియోలను బట్టి తుఫాను వల్ల జరిగిన నష్టం స్పష్టంగా కనిపిస్తుంది. 

మరోవైపు న్యూయార్క్ రాష్ట్రంలో వర్షాలు దంచికొట్టాయి. తొలిసారి ఊహించని రీతిలో వర్షాలు ముంచెత్తాయి. రికార్డు బ్రేక్ చేస్తూ కురిసినవానలకు న్యూయార్క్ సహా న్యూజెర్సీ రాష్ట్రమూ అతలాకుతలమైంది. వెంటనే న్యూయార్క్ సిటీ మేయర్ ఎమర్జెన్సీ విధించారు. న్యూయార్క్ నగర వీధులు వరదలతో మునిగిపోయాయి. సబ్ వేలూ నీళ్లతో నిండిపోయాయి. కొంతకాలం ఎమర్జెన్సీ సేవలు మినహా మరే వాహనాలూ బయటకు రావొద్దని అధికారులు ఆదేశించారు. న్యూయార్క్ చరిత్రలో తొలిసారిగా ఇంతటి వర్షం కురిసినట్టు నిపుణులు చెబుతున్నారు.

Also Read:న్యూయార్క్‌లో రికార్డ్ బద్దలు కొట్టిన వర్షాలు.. ఎమర్జెన్సీ డిక్లేర్

తమ చరిత్రలో తొలిసారి కఠిన పరిస్థితులను న్యూయార్క్ వాసులు ఎదుర్కొంటున్నారని మేయర్ తెలిపారు. సిటీలో రికార్డులు తిరగరాస్తూ వర్షాలు కురుస్తున్నాయని వివరించారు. అందుకే న్యూయార్క్ సిటీలో ఎమర్జెన్సీ విధించినట్టు చెప్పారు. ప్రజలు బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని, వీధుల్లోకి రావద్దని హెచ్చరించారు.

click me!