భూకంపం ధాటికి వణికిపోతున్న శ్రీలంక ..  

By Rajesh KarampooriFirst Published Dec 5, 2022, 4:22 AM IST
Highlights

శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైంది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.

శ్రీలంక రాజధాని నగరం కొలంబోలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైంది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. భూకంపం యొక్క లోతు భూమికి 10 కి.మీ.ఉందని తెలిపింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

అంతకుముందు (గతేడాది)రాజధానిలోనే భూకంపం సంభవించింది. డిసెంబర్ 29, 2021 సాయంత్రం దేశ రాజధాని నగరం కొలంబో అకస్మాత్తుగా భూమి కంపించింది. ఆ సమయంలో కూడా దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి నష్టం జరగలేదు.

ఇండోనేషియాలో భూకంపం  

అంతకుముందు శనివారం నాడు.. ఇండోనేషియాలోని పశ్చిమ జావా ప్రాంతంలో బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. ఈ దేశంలో తరుచు భూ  ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. అయితే ఇటీవల ఇండోనేషియాలో సంభవించిన భూకంపం వల్ల కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం 

భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. అయితే ఇందులో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.ఈ ఏడాది రాజధాని ఢిల్లీలో పలుమార్లు భూకంపం సంభవించిందని విషయం తెలిసిందే.. 

భూకంపానికి కారణం

భూకంపాలకు కారణం .. భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉండటమే. ఈ ప్లేట్లు ఎక్కువగా ఢీకొనే ప్రదేశాలను ఫాల్ట్ లైన్స్ అంటారు. తరచుగా ఢీకొనడం వల్ల ప్లేట్లు విరిగిపోతాయి. వాటి విచ్ఛిన్నం కారణంగా, లోపల ఉన్న శక్తి బయటకు రావడానికి ఒక మార్గాన్ని కనుగొంటుంది. దీనిని భూకంపం అంటారు.

click me!