COVID Variant: రాబోయే రెండు సంవత్సరాల్లో ఒమిక్రాన్ కంటే తీవ్రమైన కరోనా వేరియంట్ ఉద్భవిస్తాయని, అందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టీ హెచ్చరించారు. కరోనా ఎండెమిక్ దశకు చేరిందనుకుంటే.. అది మన భ్రమనేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం ఆసియా, ఐరోపాలో కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు.
COVID Variant: COVID-19 మహమ్మారి ముగిసిందని మీరు అనుకుంటున్నారా ? అయితే.. ఈ కథనాన్ని ఓ సారి చదవండి. కరోనా మహమ్మారి ఎంతటి బీభత్సం సృష్టించిందో అందరికీ తెలుసు.. ఈ వైరస్ సృష్టించిన అలజడి మాములు కాదు. ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకులేకుండా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా.. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్‌లతో అల్లకల్లోలం సృష్టించింది. ఇక.. ఈ మధ్యే మూడోవేవ్ ముగిసిందని.. అబ్బా కరోనా పీడ పోయిందిరా అని కాస్త రిలాక్స్ కాగానే.. అదంతా భ్రమేనని మరోసారి నిరూపితమవుతోంది. కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనాలో కొన్నివారాలుగా నమోదవుతున్న కేసులు, మరణాలు కలవరపెడుతున్నాయి. దాదాపు ఏడాది తర్వాత వైరస్ మరణాలు సంభవించడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండేండ్లలో ఒమిక్రాన్ కంటే తీవ్రమైన కరోనా వేరియంట్ పుట్టుకురావొచ్చని, అందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రిస్ విట్టి హెచ్చరించారు. కరోనా మహమ్మారి ఎండెమిక్ దశకు చేరిందన్న విశ్లేషణలను ఆయన కొట్టిపారేశారు. ఆసియా, ఐరోపాలో కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు.
ఈ వైరస్ జీవితాంతం కొనసాగుతుందని, దానితోనే సహజీవనం చేయాలని అన్నారు. ఇప్పుడు ఫ్లూ లా ఉన్నప్పటికీ.. ప్రాణాంతక ముప్పును తెచ్చిపెట్టే వైరస్ అని, మన జీవితాంతం.. మనతోనే ఉంటుందని చెప్పాడు. రాబోయే వేరియంట్స్.. ఒమిక్రాన్ కంటే తీవ్రమైన, ప్రాణాంతక సమస్యలను కలిగిస్తాయని అన్నారు. అలాగే.. వైరస్ లను వచ్చే సవాళ్లు ఏ విధంగానూ తక్కువ అంచనా వేయకుండదనీ, వాటి ఆవిర్భావం, ప్రమాద స్థితి రోజురోజుకు గణనీయంగా మార్చగలవని విట్టి పేర్కొన్నారు.
undefined
కోవిడ్ పూర్తిగా అంతమవుతుందనే ఆలోచనను కొట్టిపారేయని.. ఇప్పటికే అనేక దేశాలు కొవిడ్ ఆంక్షాలను సడలించాయనీ, ప్రపంచవ్యాప్తంగా అన్ని పరిస్థితులు స్థిరమైన స్థితికి చేరిందని అనుకోవడం సరికాదని అన్నారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో వచ్చే కొత్త వేరియంట్ లు మరింత ప్రమాదకరంగా ఉండబోతున్నాయనీ హెచ్చరిస్తున్నారు. గతంలో ఎప్పుడు చూడని విధంగా.. ఈ వేరియంట్ల వారిలో పడే వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. ఎందుకంటే Omicron వైరస్ యొక్క వంశంలో వేరే భాగం నుండి ఉద్భవించింది,తదుపరి జాతి Omicron నుండి నేరుగా పరిణామం చెందుతుందని ఎటువంటి హామీ లేదని అన్నారు.
UKలో కరోనా పరిస్థితి
UK లో కొద్దిసేపు విరామం తర్వాత COVID కేసులు, మరణాల సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది. గతవారంతోపోలిస్తే..కోవిడ్ మరణాలు పావు వంతు పెరిగాయని, ఇప్పటి వరకు 250 మందిని చనిపోయినట్టు నివేదిక తెలిపింది. మార్చి 18న ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 1,879 గా ఉండగా.. వారంలోనే ఆ సంఖ్య 17 శాతం పెరిగింది.