COVID-19 Study: కరోనా బారిన పడి కోలుకున్న వారిలో ఆరు నెలల దాకా రక్తంలో గడ్డలు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు స్వీడన్ పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా కాళ్లలోని రక్తనాళాల్లో, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉన్నట్టు వెల్లడించారు. అలాగే రక్తస్రావం అయ్యే ప్రమాదం రెండు నెలలపాటు ఉంటున్నట్టు వారి పరిశోధనలో తేలింది.
COVID-19 Study: గత రెండేళ్లల్లో ప్రపంచ దేశాలను కరోనా ఏవిధంగా వణికించిందో ? ఆ మహామ్మారి ఏ విధంగా తన పంజా విసిరిందో అందరికీ తెలుసు. తాజాగా.. చైనాలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా.. కరోనా వ్యాప్తి చెందుతోంది. దీంతో మరోసారి ప్రపంచ దేశాలు భయాందోళనలకు గురవుతున్నాయి. ఇదిలా ఉంటే.. మరో సంచలన లాంటి విషయం వెలుగులోకి వచ్చింది. కోవిడ్-19 బాధితుల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా.. కోవిడ్ 19 నుంచి కోలుకున్న తర్వాత ఆరు నెలల వరకు రక్తంలో గడ్డలు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని స్వీడన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.
కరోనావైరస్ కారణంగా తీవ్ర అనారోగ్యం పాలైన రోగుల్లో 30 శాతం మందిలో ప్రమాదకరంగా రక్తపు గడ్డలు(బ్లడ్ కాట్స్) ఏర్పడుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. దీనిని వైద్యభాషలో థ్రాంబోసిస్ గా పేర్కొంటారు. ఇలా బ్లడ్ క్లాట్స్ చాలామంది చనిపోవడానికి కారణమ వుతున్నాయని చెబుతున్నారు. అధ్యయనం ప్రకారం డీప్ వెయిన్ త్రాంబోసిస్ (డివిటి) అని పిలువబడే రక్తం గడ్డకట్టే ప్రాబల్యం 14-28 శాతం అలాగే ధమనుల త్రంబోసిస్‌కు 2-5 శాతం ఉందని స్వీడన్‌లోని ఉమేయా విశ్వవిద్యాలయం పరిశోధకులు చెబుతున్నాయి.
undefined
అయితే... డీప్ వెయిన్ త్రాంబోసిస్ (డివిటి)ముప్పు మూడు నెలలపాటు, ఊపిరితిత్తుల్లో (పల్మనరీ ఎంబోలిజం) గడ్డలు ఏర్పడే ముప్పు ఆరునెలలపాటు, రెండు నెలల వరకు రక్తస్రావం ముప్పు ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు, అంతర్లీన పరిస్థితులతో బాధపడుతున్న రోగులలో, తీవ్రమైన COVID-19 ఉన్న రోగులలో ఈ సమస్య అధికంగా ఉంటుందని తెలిపారు. అలాగే..సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ లతో పోలిస్తే.. మొదటి పాండమిక్ వేవ్ లో కరోనా బారినపడి వారిలో రక్తం గడ్డ కట్టే ప్రమాదం అధికంగా ఉన్నట్టు తెలిపారు.
స్వీడన్‌లోని ఉమేయా విశ్వవిద్యాలయం పరిశోధకులు .. కోవిడ్-19 నిర్ధారణకు ముందు మరియు కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో డీప్ వెయిన్ త్రాంబోసిస్( రక్తం గడ్డకట్టడం), పల్మనరీ ఎంబోలిజం, రక్తస్రావ రేట్లను పరిశీలించారు. COVID- తర్వాత వేర్వేరు సమయ వ్యవధిలో ఉన్న రేట్లతో పోల్చారు. రక్త గడ్డ కట్టే( థ్రోంబోటిక్ ) సంఘటనలను నిరోధించడానికి, ముఖ్యంగా అధిక ప్రమాదం ఉన్న రోగులకు మరియు COVID-19కి వ్యతిరేకంగా టీకా యొక్క ప్రాముఖ్యతను బలోపేతం చేసే చర్యలకు మద్దతు ఇస్తాయని పేర్కొన్నారు. ఈ అధ్యాయనంత కోసం.. స్వీడన్‌లోని జాతీయ రిజిస్ట్రీలను ఉపయోగించి.. వారు.. ఫిబ్రవరి 1, 2020 నుంచి మే 25, 2021 మధ్యకాలంలో SARSCoV-2 గురైన వారిపై పరిశోధనలు చేశారు.