
China corona: చైనాలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా.. కరోనా వ్యాప్తి చెందుతోంది. ప్రధానంగా.. షాంఘై నగరంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. నిత్యం వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే షాంఘైలో లాక్‌డౌన్ అమలు చేస్తుంది. దీంతో 26 మిలియన్లకు పైగా జనాభా తమ ఇండ్లకే పరిమితమైంది. ఈ క్రమంలో రోజువారీ కేసులు కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి.
ఇతర దేశాలతో పోలిస్తే ఇది ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉంది. దీంతో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా స్థానిక అధికారులు వింత ఆంక్షలు విధించారు. ఈ రాత్రి నుండి.. జంటలు కలిసి పడుకోవద్దని, కౌగించుకోకూడదని, ముద్దులు పెట్టుకోవడానికి వీళ్లేదని, బాల్కనీలో నిల్చోవద్దని, పాటలు పాడొద్దని ప్రకటించారు. ఈమేరకు అధికారులు వీధుల్లో తిరుగుతూ హెచ్చరిస్తున్నారు. రోబోలతో ప్రచారం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్థానిక జర్నలిస్టులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తితో దేశ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. షాంఘై వాసులు కఠినమైన జీవితాన్ని గడుపుతున్నారు.చైనా దేశంలోని షాంఘై నగరం కరోనా వ్యాప్తికి హాట్ స్పాట్ గా మారింది.
COVID నియంత్రణల కారణంగా ఆహారం,అవసరమైన వస్తువుల పంపిణీపై నివాసితులలో అసంతృప్తి పెరుగుతోంది. నగర పాలక సంస్థ సమస్యను గుర్తించింది, పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషి
చేస్తోంది.